నమస్తే తెలంగాణ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ రోజు బ్యానర్ వార్త చాలా మంది టీఆరెస్ , కేసీఆర్ అభిమానులకే రుచించలేదు. వాళ్లే జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ ఇక్కడికి వస్తున్నాడని, ఇక్కడే మకాం వేస్తాడని, బీజేపీ వాళ్ల అక్రమాలు పెరిగిపోయాయని, భారీ మెజారిటీ సాధించే దిశగా ఆయన కార్యాచరణ రూపొందించారని, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల తంతుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడని.. ఏదేదో రాశారు. ఇది కాస్త వెరైటీగానే అనిపించింది. ఇదేందీ..? నమస్తే తెలంగాణలో ఇలాంటి వార్తా..? కేసీఆర్ చెబితనే తప్ప బ్యానర్ రాసేంత దమ్ము ఎడిటర్‌కు ఉందా..? లేక తనే అత్యుత్సాహంతో అక్కడ టీఆరెస్‌కు గడ్డు పరిస్థితి ఉందనే చెప్పకనే చెప్పాడా..? ఏదేమైతే ఏందీ గానీ, ఈ వార్త మాత్రం టీఆర్ఎస్ వాళ్లకు సుతరామూ నచ్చలేదబ్బ.
ఇదే విషయాన్ని బాహాటంగానే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నానరు. ఒకరేమో ఇదే నిజమైతే బీజేపికి మరింత బలం చేకూర్చినట్టేనని కుండబద్దలు కొట్టగా.. మరొకరు … ఇది నమస్తే తెలంగాణ చదివినట్టు లేదు.. సేమ్ దిశలో రాసినట్టే రాశారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ చేత శభాష్ అనిపించుకునేందుకు ఎడిటర్ ఇలా అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అవి బూమరాంగ్ అయి కూర్చుంటాయి. ఇప్పటిదాక క్షేత్రస్థాయిలో టీఆరెసోళ్లు పడ్డ శ్రమ… పడుతున్న కష్టం కాస్తా ఈ ఒక్క వార్త అలా తీసిపారేసిన్టటైంది. సీఎం కేసీఆర్ ఇక్కడ తిష్ట వేస్తే తప్ప ఫలితం, ప్రయోజనం ఉండదు అనే రేంజ్‌లో ఆ వార్త బ్యానర్‌గా ప్రచురించడం… ఎవరికి లాభం చేకూర్చేందుకు తీగుళ్ల కృష్ణమూర్తి. నిన్ను ఎడిటర్‌గా పెట్టుకున్నందుకు అప్పుడప్పుడు ఇలా పార్టీ రుణం తీర్చుకుంటూ ఉంటావన్న మాట…
#ఇన్నారుళ్లా
“బీజేపీ నేతల ఆగడాలపై కేసీఆర్ ఆగ్రహం..
.. పోలింగ్ దాకా అక్కడే మకాం వేసే ఆలోచన!”
ఇదే నిజమైతే రాజగోపాల్/ బీజేపీకే ఎక్కువ ప్రయోజనం..
‘గెలుపు మీద నమ్మకం లేనట్లుంది
యేడాది సీటు కోసం ఓవర్ చేస్తుండ్రు
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తుండ్రు’
…అని సామాన్యులు అనుకోవడం పక్కా😎
ధాము నర్మాల