కారు గుర్తుకు దరిదాపుల్లో సేమ్‌గా ఉండే మరో ఎన్నికల గుర్తు రోడ్డు రోలర్. ఈ గుర్తు వల్ల చాలా చోట్ల ఎన్నికల్లో టీఆరెస్ నష్టపోయింది. కొన్ని చోట్ల గెలుపోటముల పై కూడా ఈ గుర్తు ప్రభావం చూపే దాకా పోయింది. మిగిలిన కారును పోలిన గుర్తులతో పోల్చితే ఈ రోడ్డు రోలర్ గుర్తు అత్యంత ప్రమాదకమని అధికార పార్టీ భావించింది. దీనిపై యుద్దమే చేసింది. గతంలో దీన్ని తీసేసి మళ్లీ ఈ మునుగోడు ఉప ఎన్నికలో ఎలా పెడతారంటూ ఫిర్యాదుల పర్వంతో యుద్దానికి తెరలేపి.. చివరకు పై చేయి సాధించింది.
బ్యాలెట్ బాక్సులో వరుసగా ఐదోనెంబర్‌లో ఈ రోడ్డు రోలర్ గుర్తు ఉంటుండే. కానీ టీఆరెస్ చేసిన పోరాటంతో దీన్ని ఈ ఎన్నికల బ్యాలెట్ నుంచి తొలగించారు. మొత్తానికి అనుకున్న సాధించి… జరగబోయే ప్రమాదాన్ని నివారించినందుకు టీఆరెస్ శ్రేణులు ఆనందంగా ఉన్నారు. లేదంటే ఈ రోడ్డు రోలర్ యాక్సిడెంట్‌కు కారుకు డ్యామేజీ పక్కాగా ఉండేది. అది గత అనుభవాలు చూస్తే తెలిసిపోతుంది. అందుకే టీఆరెస్ చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలనే సిద్దాంతాన్ని నమ్మింది. అదే పాటించింది. చివరకు విజయం సాధించింది. ప్రతీ ఓటు ఈ ఎన్నిక గెలుపులో కీలకం కానుంది. ఆటంకాలు ఎన్ని ఉన్నా.. వాటన్నింటినీ అధిగమించి గెలుపు తీరాలకు చేరడమే టీఆరెస్ లక్ష్యం. అందుకే రోడ్డు రోలర్ గుర్తు విషయంలో చాలా సీరియస్‌గా ఉండి …దాన్ని తొలగించే వరకు పట్టుబట్టి పోరాడి విజయం సాధించారు.