పెళ్ళికి ముందు ‘ఆమె’ ఎవరితో శారీరక సంబంధం పెట్టుకున్నా.. కనీసం పెళ్ళైన తరువాతనైనా ‘ఆమె’ తన భర్త తో తప్ప , మరెవడితోనూ శారీరక సంబంధం పెట్టుకో కూడదు అని చాలా మంది పురుషులు భావిస్తూ ఉంటారు.

అయితే స్త్రీలు కూడా తన భర్త గురించి అలాగే అనుకుంటారు ‘అతను’ తన తో తప్ప మరో ‘ఆవిడ’తో శారీరక (వివాహేతర) సంబంధం పెట్టుకో కూడదని.. కానీ ఆ భర్త మీద (సమాజం నుంచి) పెద్దగా కట్టుబాట్లేవీ ఉండవు.

భర్త తన భార్యతో కాకుండా ఇతర స్త్రీలతో శారీరక సంబంధం పెట్టుకుంటే.. ఆ విషయాన్ని సమాజం సీరియస్ గా తీసుకోదు. పైగా మగ వాడికి ‘అది common ఏ’ అన్నట్టుగా చూస్తుంది, ఈ దరిద్రపుగొట్టు సమాజం. ఈ పురుషాధిక్య సమాజంలో భర్త కొక న్యాయం. భార్యకు మరొక రకం న్యాయం ఉంటుంది !

ఇది సరియైన పద్ధతి కాదు. ఎందుకంటే.. “ఎదుటి వ్యక్తి తనతో తప్ప , ఇతరులెవ్వరి తోనూ శారీరక (వివాహేతర) సంబంధం పెట్టుకో వద్దు” అని ఎవరైనా అనుకుంటే.. వారు కూడా, వారి స్వంత క్యారెక్టర్ విషయంలో.. అలాంటి కంట్రోల్ ఏ పెట్టుకోవాలి, తన భాగస్వామి తో తప్ప మరే ఇతరులతో శారీరక (వివాహేతర) సంబంధం పెట్టుకో కూడదు..

సింపుల్ గా చెప్పాలంటే.. “పక్క చూపులు” చూసే అలవాటు గనుక నీకుంటే.. నీ భాగస్వామిని “అదుపులో ” ఉంచాలి (తనను “పక్క చూపులు చూడనివ్వకూడదు” అని భావించే అర్హత కూడా నీకుండదు గాక ఉండదు…

పెళ్లి చేసుకోగానే భార్య శరీరం మీద, ఆమె భర్తకు సర్వ హక్కులేం రావు. భార్య కాన్సెంట్ తీసుకోకుండా.. స్వయంగా ఆమె భర్త అయినా సరే.. (ఆయనకు ఇంగిత జ్ఞానం ఉంటే, without her consent) ఆమెతో పక్క పంచుకునే ప్రయత్నం కూడా చేయకూడదు ! కానీ ఇండియా లో marital rape అనేది, ప్రతీ సంసారంలో common అయి కూర్చుంది !!

— Rajeshwer Chelimela

You missed