హిరో నితిన్ ఓ ఫెయిల్యూర్ హీరో. ఎన్ని సినిమాలు తీసినా పాపం లేవ‌డం లేదు. ఎవ‌రు ఎన్ని జాకీలు పెట్టి లేపినా లేవ‌డం లేదు. జ‌యంతో జ‌యం సాధించాడంటే అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్టూ లేదు. మ‌ధ్య‌లో క‌రోనా టైంలో వ‌చ్చిన భీష్మ ప‌ర్వాలేద‌నిపించినా.. అది చూసేవారు లేరు. ఓటీటీకి ప‌రిమిత‌మైంది. అట్లాంటి ఫ్లాప్ హీరోను జేపీ న‌డ్డా క‌ల‌వాల‌నుకున్నాడ‌ట. బండి సంజ‌య్ హ‌డావుడిగా పిలిపించాడు. క‌లిపించాడు. న‌డ్డా శాలువాతో స‌న్మానించాడు. నువ్వు తీసిన సినిమా బాగుంద‌ని ఏదో అన్నాడు.

నితిన్‌కు అర్థం కాలేదు.. అవునా..? అని ఆశ్చ‌ర్య‌పోయాడు. బుర్ర గోక్కున్నాడు. నా ఫ్లాప్ సినిమాల్లో ఏది న‌చ్చింది ఈయ‌న‌కూ.. అని ఎంత ఆలోచించినా త‌ట్ట‌లేదు. ఈ మీటింగు ఇలా ఒడిసింది. చివ‌ర‌కు న‌డ్డాకు తెలిసిందేమిటంటే త‌ను.. కార్తీకేయ సినిమా లో న‌టించిన నిఖిల్‌ను తీసుకుర‌మ్మంటే నితిన్‌ను తీసుకువ‌చ్చార‌ని. కార్తికేయ సినిమా మంచి హిట్ టాక్ వ‌చ్చింది. శ్రీ‌కృష్ణుడిని ప్ర‌మోట్ చేస్తూ తీసిన ఆ సినిమా బాగా ఆక‌ట్టుకుంది. దీని కోసం ఆ హీరోను న‌డ్డా అభినందించాల‌నుకున్నాడ‌ట‌. కానీ బండి సంజ‌య్ ఆగ‌మాగం విని హీరో నితిన్‌ను తీసుకొచ్చాడు. అప్ప‌టికే మీడియాలో వార్త‌లు వండే ప‌నిలో ప‌డ్డారు మ‌న జ‌ర్న‌లిస్టు మిత్రులు. బీజేపీలోని నితిన్‌. అత‌ను నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడ‌ట‌. అత‌ను కాక‌పోతే ఆయ‌న మామ కాట్‌ప‌ల్లి న‌గేశ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి రూర‌ల్ నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంది.. అంటూ ఏవేవో ప్ర‌చారాలు.. వార్త‌లు… లాస్ట్‌కు ఇలా బండి సంజ‌య్ కంగారుతో ఇదంతా జ‌రిగింద‌ని తెలిసిన త‌ర్వాత ఇగో జూస్కో నా సామిరంగా..!! టీఆరెసోళ్లు ఒక ఆట ఆడుకున్నారు బండిని.

ఐశ్వ‌ర్య రాయ్‌ను పిలువుర్రా అంటే క‌ల్ప‌నా రాయ్‌ను పిలుస్తారు కావొచ్చు అని ఒక‌డు..
రాధాకృష్ణ ను ర‌మ్మంటే ర‌మ్య‌కృష్ణ‌ను తెస్తార్రోయ్ అని మ‌రొక‌డు…
త‌మ‌న్నాను తీసుకురాండ్రిరా అంటే మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ తెస్తాడు కావొచ్చ‌ని ఇంకొక‌డు..
హీరో రాజ‌శేఖ‌ర్‌ను తీసుకురారా బై అంటే.. డైరెక్ట‌ర్ అమ్మ రాజ‌శేఖ‌ర్‌ను తెస్తారు కావ‌చ్చురోయ్ అని మ‌ళ్లొక‌డు….

ఇలా ఆడుకుంటున్నారు. పాపం బండి…. ఫాపం నితిన్‌…..