నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డులో బీజేపీ నేతలు చేపట్టిన రైతు ధర్నా వెలవెలబోయింది. సభకు పట్టుమని ఐదొందల మంది కూడా రాలేదు. అందులో బీజేపీ కార్యకర్తలే తప్ప రైతులు లేరు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు సరిగ్గా జనం లేకపోవడంతో దీన్ని కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రోజు సామూహిక జాతీయ గీతాలాపన ఉన్నందున అందరూ అక్కడే ఉండిపోయారని, అందుకే ఎవ్వరూ హాజరుకాలేకపోయారని సర్థిచెప్పుకోవడం నవ్వు తెప్పించింది.
@ రఘునందన్ మాట్లాడుతూ.. సీఎం మోర్తాడ్ సభలో ఐకేపీల ద్వారా అల్లం, పసుపు కొనిపిస్తామన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామన్నారు.. చేశారా..? మీరు చేయండి ముందు.. ఆ తర్వాత ఆరు నెలలకు మేం కూడా పసుపు బోర్డు తెస్తామన్నాడు. బీజేపీ పలాయనవాదానికి ఇది నిదర్శనం. బాండు పేపర్ బాజాప్తా రాసిచ్చాం కదా.. చేపిస్తాం.. అన్నాడు.
ఆ తర్వాత అర్వింద్ మాట్లాడుతూ.. పసుపుబోర్డు వల్ల లాభం లేదనే తేలేదని ఒప్పుకున్నాడు. ఎన్నికలప్పుడు బాండు పేపర్ రాసిచ్చినప్పుడు లాభమో నష్టమో తెలియలేదా..? అప్పుడు ఎన్నికలప్పుడు పోటీ చేసిన రైతులకు మేం పసుపు బోర్డు వల్ల ఉపయోగం లేదని చెప్పుకుని ఒప్పించుకున్నామని చెప్పుకొచ్చాడు. దాని వల్ల వచ్చే ఆటంకాలు , నష్టాలు అంటూ ఏకరువు పెట్టాడు.
తాళ్ల రాంపూర్ సొసైటీ అక్రమాల గురించి మాట్లాడారు. ఇది అయిపోయిన ముచ్చట. ఎక్కడికక్కడ దీనిపై రికవరీ యాక్టు , చర్యలు తీసుకున్నారు. పస లేని ప్రసంగంలో ఇదొకటి.
రైతుబం ధు వందల ఎకరాల ఆసాములకు ఇచ్చి వందకోట్లకు 70 కోట్లు సీఎంకు ఇస్తున్నారంటూ నిరాధార మతిలేని ఆరోపణలు చేశాడు అర్వింద్. ఫసల్ బీమా యోజన గుజరాత్‌లో లేదని ఒప్పుకున్నాడు. కానీ అక్కడ సీఎం కిసాన్ ఇంకేదో ఉందంటూ కవర్ చేశాడు.
బాల్కొండ నియోజకవర్గంలోని కట్టిన చెక్ డ్యాంలకు కూడా కేంద్రం నిధులు 60 కోట్లు ఇచ్చారని చెప్పుకొచ్చాడు షరా మామూలుగా. అన్నింట్లో మా వాటా ఉందని చెప్పడం బీజేపీకి అలవాటుగా మారింది.. జనం దీన్ని పెద్దగా పట్టించుకోవడమూ మానేశారు.
నిజామాబాద్ జిల్లాలో కొత్త 42 రైస్ మిల్లులు తర్కోళ్లకు ఇచ్చారన్న అర్వింద్… బియ్యం బ్లాక్ దందా చేసేందుకే సీఎం వీరిని ఎంకరేజ్ చేస్తున్నాడని అనడం ఆయన స్థాయిని పట్టించింది. మతిలేని ప్రసంగంలో ఇదొకటి.
బాల్కొండలో బండి సంజయ్ పాదయాత్ర చేసుకునేలా ప్లాన్ చేస్తానని, మల్లిఖార్జున్ రెడ్డిని ఏర్పాట్లు చేసుకోవాలని ఈ వేదికగా అర్వింద్ చెప్పడం.. వారి రాజకీయాలకు వేదికగా దీన్ని వాడుకున్నారని తేలిపోయింది. బీజేపీలో సునీల్‌రెడ్డి రావడాన్ని అడ్డుకున్న అర్వింద్.. మల్లిఖార్జున్ రెడ్డికి తన తరుపున గ్రీన్ ఇచ్చాడు ఈ ధర్నా వేదికగా.