మూడేండ్లుగా న‌మ‌స్తే తెలంగాణ ఉద్యోగుల‌కు జీతాల్లేవు. వీరి జీతాలు పెంచ‌డం అధికార పార్టీ ప‌త్రిక యాజ‌మాన్యానికి ఓ లెక్క కాదు. మ‌రెందుకు వారి గోడు వినిపించుకోవ‌డం లేదు. కార‌ణం… ఎడిట‌ర్ కృష్ణ‌మూర్తి. ఆ ప‌త్రిక‌లో ఏనాడైతే ఆయ‌న అడుగు పెట్టాడో ఆనాటి నుంచే ఉద్యోగుల‌కు శ‌ని ప‌ట్టుకున్న‌ది. క‌రోనా పేరు చెప్పి ఎడాపెడా ఉద్యోగుల‌ను పీకేశాడు. వారి కుటుంబాల‌ను రోడ్డు పాలు చేశాడు. ఆంధ్ర‌జ్యోతి నుంచి త‌న టీమ్‌ను తెచ్చుకుని పెట్టుకున్నాడు. వారికి జీతాలు అమాంతం పెంచేశాడు. ఉద్య‌మ స‌మ‌యం నంచి ఎన్నో ఆశ‌లు పెట్టుకుని త‌మ ఇంటి ప‌త్రిక‌గా భావించి ప‌నిచేసిన ఉద్యోగుల బాగోగుల‌ను పాత‌రేసి… త‌న టీమ్‌ను పెంచి పోషించుకున్నాడు కృ.తి. త‌న సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

కృ.తి. వికృత చేష్ట‌లు భ‌రింలేక ఉద్యోగాలు పోయిన బాధితులంతా హైద‌రాబాద్ హెడ్ ఆఫీసు ముందే ధ‌ర్నా చేసేందుకు సిద్ద‌మ‌వ్వ‌గా చివ‌రి నిమిషంలో ఈ విష‌యం కేటీఆర్‌కు తెలిసి.. వారికి రెండు నెల‌ల జీతాలిచ్చి పంపించేశాడు. ఆనాటి నుంచి ఎడిట‌ర్ ప‌ట్ల కేటీఆర్‌కు అసంతృప్తి ఏర్ప‌డింది. అత‌ని వ‌ల్ల పార్టీకి , ప్ర‌భుత్వానికి ఉప‌యోగం మాట‌టుంచి పేప‌ర్ బ‌ద్నాం అవుతుంద‌ని, ఆ ప్ర‌భావం త‌మ‌పైనా ప‌డుతుంద‌ని అత‌ను గ్ర‌హించాడు. అప్ప‌ట్నుంచి ఎడిట‌ర్ మాట‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశాడు. ఎడిట‌ర్‌కు ఇచ్చిన మూడేండ్ల అగ్రిమెంటు వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రితో ముగుస్తుంది. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూస్తున్నారు. ఎడిట‌ర్‌ను సాగ‌నంపిన త‌ర్వాతే ఆ పేప‌ర్ బాగోగుల‌పై న‌జ‌ర్ పెడ‌తార‌న్న‌మాట‌. అప్ప‌టి వ‌ర‌కు కృ.తి టీమ్‌కు త‌ప్ప‌.. మొద‌టి నుంచి ఉన్న ఉద్యోగుల‌ను ప‌ట్టించుకునేవాళ్లుండ‌రు. ఎన్ని ధ‌ర్నాలు చేసినా… పెన్ డౌన్లు చేసినా.. ఇలా బుజ్జ‌గించి అలా ప‌ని చేయించుకుంటారంతే.

You missed