ఆయ‌న ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే. అగ్ర నేత‌ల‌తో చాలా ద‌గ్గ‌ర సంబంధాలుంటాయి. ఉన్నాయ‌ని చెప్తాడు. మాట్లాడితే వాళ్ల పేర్ల‌ను విరివిగా విచ్చ‌ల‌విడిగా వాడేసుకుంటుంటాడు. ఇంత చేసినోడు బెదిరించ‌కుండా ఉంటాడు. బెదిరిస్తాడు. ఎవ‌రిని ప‌డితే వాళ్ల‌ను. ఎంత నోటికొస్తే అంత‌కు.మాతో పెట్టుకోకురోయ్‌….. మేం మంచోళ్లం కాదు… పెండ్లాం పిల్ల‌ల‌ను ఎత్తుకుపోతాం రో … అని బెదిరింపుల‌కు దిగుతాడు. అవ‌త‌ల ఎలాంటి ఆఫీస‌రైనా స‌రే… ఇక ఈ మాట‌న్నాకా.. ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించ‌గ‌లం. అంతే ఇంకోసారి ఆయ‌న‌గారి ప‌నుల‌కు అడ్డుత‌గ‌లొద్దు. రూల్స్ తొక్క తోలు అని మాట్లాడొద్దు. జీవోలు , ఫెనాల్టీలు, కేసులు అని చ‌ట్టాలు వ‌ల్లెవేయొద్దు. క‌ళ్లు, చెవులు.. అన్నీ మూసుకుని అలా ఏం జ‌రిగినా చూస్తుండాలి. మిన్న‌కుండాలి.

ఆ అధికారి ఈ విష‌యాన్ని లేటుగా ఇంకో అధికారితో చెప్పుకున్నాడు. ఇదేం డ్యూటీరా నాయ‌న‌. ఈ లీడ‌ర్ల‌కు ఎంత‌కు తెగిస్తున్నారో చూసిన‌వా…? పెండ్లాం పిల్ల‌ల‌ను ఎత్తుకుపోతాం అని బెదిరించే నీచ స్థితికి దిగ‌జారి పోయిండ్రు… ఛీ దీన‌మ్మ ఈ డ్యూటీ చేసే బ‌దులు లాంగ్ లీవ్ పెట్టి చెక్కేసింది బెట‌రు… అన్నాడ‌ట‌. ఏడ్వ‌ట‌మొక్క‌టే త‌క్కువ‌. పై అధికారుల‌కు ఈ విష‌యం చెబితే .. పాపం వాళ్లేం చేస్తారు…. వాళ్ల‌కూ మ‌రీ ఇంత‌లా కాకున్నా… చిన్న‌గ‌నో, సుతిమెత్త‌గ‌నో.. చెప్పీ చెప్ప‌క‌నో… ఏదో విధంగా బెదిరించే ఉంటాడు ఆ లీడ‌రు.

ఇక్క‌డ చెప్పొచ్చేది ఆ పెండ్లాం పిల్ల‌ల‌ను ఎత్తుకుపోతా అని బెదిరించిన ఒక్క లీడ‌ర్ గురించి కాదు… ఇప్పుడు న‌డ‌స్తున్న వ్య‌వ‌హారం గురించి. కొంద‌రు అధికార పార్టీ ఎమ్మెల్యేల బ్లాక్‌మెయిల్ రాజ‌కీయాల గురించి. మ‌ర్డ‌ర్ పాలిటిక్స్ గురించి. అధికారం ముసుగులో న‌డిపే దందా గురించి. అధికారుల‌ను బానిస‌ల క‌న్నా అధ్వాన్నంగా చూస్తున్న తంతు గురించి. ప‌ట్టింపులేని త‌నం గురించి. అక్ర‌మార్జ‌న‌కు అల‌వాటుప‌డిన వైనం గురించి. ఎంత‌కైనా తెగించే దిగ‌జారుడుతనం గురించి.

You missed