నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ…ఢిల్లీలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో అమిత్ షా తెలంగాణ పై చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం యెనిమిది సంవత్సరాల తర్వాతనైనా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి గుర్తుకు వచ్చినందుకు థాంక్స్
మొట్ట మొదటి సారిగా ఢిల్లీలో వేడుకలు నిర్వహిస్తున్నారు.తెలంగాణ మంచి కోసం ఏమైనా చేస్తారనే ప్రకటన ఆశించాం.
కానీ అవే రాజకీయాలు,అవే అబద్ధపు ప్రచారాలు.ఇక్కడి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినట్లే అమిత్ షా మాట్లాడిండు.
పార్లమెంట్ సాక్షిగా మోడీ, ఢిల్లీలో అమిత్ షా తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతున్నారు.
కేంద్ర బీజేపీ నాయకులకు నరనరాన మొదటి నుంచి తెలంగాణ అంటే విద్వేషమే
ఆంధ్ర ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీత రామరాజు ను తెలంగాణ ఉద్యమ కారునిగా చిత్రీకరించారు.
ఢిల్లీలో తెలంగాణ భవన్ లోని ఎక్స్బిషన్ లో తెలంగాణ మహనీయుల ఫోటోల నడుమ ఆయన ఫోటోలు పెట్టారు.
అల్లూరి సీతారామరాజు అంటే మాకు అపార గౌరవం కానీ ఆయనకు తెలంగాణ ఉద్యమంతో ఏం సంబంధం.తెలంగాణలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన మన్యం బిడ్డ అని చెప్తడు.
ఆపాటి సోయి కూడా అమిత్ షా కు పక్కనుండి తలలు ఊపుతున్న ఇక్కడి బీజేపీ నాయకులకు లేదు
