ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో నూకల రాజకీయ పోరు పతాక స్థాయికి చేరుకున్నది. యాసంగి బియ్యం మాకొద్దని అందులో వచ్చే నూకలు మీరే తినండని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించడం… రాజకీయ దుమారం లేపింది. తెలంగాణ ప్రజలను అవమానించి నూకలు తిని బతకండని మాట్లాడిన కేంద్ర మంత్రి మాటలపై టీఆరెస్ ఫైర్ అవుతున్నది. ఇప్పటికే కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యింది. రేపు ఉగాది తర్వాత ఇక ఉద్యమబాట పట్టనుంది. టీఆరెస్. పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నది. బాయిల్డ్ రైస్ స్టాకు చాలా ఉందని, మాకొద్దని ముందే చెప్పామని సాకు చూపుతున్నది కేంద్రం. కానీ కేంద్రం కొనకపోతే వాటిని రాష్ట్రం కొనుగోలు చేసి ఏం చేస్తుంది..? ఇదే మాట కేంద్రాన్ని అడిగితే.. మీరే తినండి.. మీరే అమ్ముకోండి.. ప్రైవేటు వారికి అంటగట్టండని ఏవోవే ఉచిత సలహాలు కూడా ఇస్తున్నది కేంద్రం. ఈ వాదనలు, వాదోపవాదాల నడుమ రైతు నలిగిపోతున్నాడు. వరైతే వేశాడు. కోతలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి.
కేంద్రం మెడలు వంచైనా వడ్లు కొనుగోలు చేపిస్తామంటున్నది రాష్ట్రం. ఇదేంది..? బియ్యం వద్దంటుంటే.. ఇప్పుడు కొత్తగా ధాన్యం అంటున్నారు…? ఇదేం రాజకీయమంటున్నది కేంద్రం. రైతులతో కలిసి ఇక ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు రెడీ అయ్యింది రాష్ట్రం. వరి సాగు… యాసంగి వడ్ల విషయంలో గతంలో ఏనాడూ ఇంత గందరగోళ పరిస్థుతులు లేవు. ఈ నూకల రాజకీయంలో ఏ పార్టీకి నూకలు చెల్లుతాయి..? ఎవరు మూల్యం చెల్లించుకుంటారు…? ఇదిప్పుడు రైతులు డిసైడ్ చేయాల్సిన విషయం….
సందట్లో సడేమియా అని కాంగ్రెస్ కరెంటు కోతలపై మాట్లాడుతున్నది. ఆందోళన చేస్తున్నది. అసలు విషయం పక్కదారి పట్టించి చలి మంటలు కాచుకోవడమంటే ఇదే.. రేవంత్ రెడ్డికి ఎవరు సలహాలిస్తారో..? పాపం పార్టీలోనే కాదు.. ప్రజల వద్ద కూడా చులకనైపోతున్నాడు ఇలాంటివి చేసి.
ఆర్టీసీ చైర్మన్ , రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తనయుడు, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ మీడియాతో మాట్లాడాడు దీనిపై…..