ఐదు రాష్రాటలకు సరికొత్త సమీకరణలకు తెర తీశాయి. ఇస్పటి వరకు ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ పార్టీగా అవతరించింది. బీజేపీకి ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ సత్తా చాటింది.
- మహామహులు, హేమాహేమీలను ఆద్ ఆద్మీ చీపురుతో తుడిపేసింది. రోజు కూలీలుగా పని చేసే వ్యక్తులు.. సాదాసీదా వ్యక్తులు మహామహులను చిత్తుగా ఓడించారు.
- కాంగ్రెస్ పార్టీ ఉన్న పరువును పోగొట్టుకుంది. ఉత్తర ప్రదేశ్‌లో అసలు అడ్రస్ లేకుండా పోయింది.
- భారతీయ జనతా పార్టీ మరోసారి దేశంలో ప్రబల శక్తిగా అవతరించింది. బీజేపీ పట్ల ప్రజలు విశ్వాసం కనబరిచారు.
- ఉత్తర ప్రదేశ్‌లో బాగా సీట్లు తగ్గుతాయని అందరూ భావించినప్పటికీ అంతగా ఏమీ తగ్గలేదు.
- బీఎస్పీ, కాంగ్రెస్ గాలికి కొట్టుకుపోయినా.. ఆ ఓట్లు ఎస్పీకి అనుకూలంగా మారలేదు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీని ఆదరించారు.
- ఇప్పటి వరకు కూడా మమత బెనర్జీ, కేసీఆర్ ఒక్క రాష్ట్రానికే పరిమితమయ్యారు. ఆమ్ ఆద్మీ జాతీయ పార్టీగా అవతరించింది. నీతి, నిజాయితీ, విద్య వైద్యం… ఆ పార్టీని ముందుకు నడిపించాయి.
- పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ బాగా ప్రభావం చూపుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెల్లడించాయి.
ఊహించినదానికంటే ఎక్కువ సీట్లు సాధించి… బీజేపీ అగ్ర నేత… పీఎం మోడీ కీ ఏకైక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. అందరి చూపు ఇప్పుడు ఆప్ పైనే పడింది. - కేజ్రీవాల్ తన చీపురుతో సామాన్యుల చేతికి అధికారం కట్టబెట్టిండు.
- ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాతల ప్రభావం.. రాష్ట్ర రాజకీయాలపై ఎలా ఉండబోతుంది.. ? ఇప్పుడు ఇదే ఆసక్తికరమైన చర్చ.
- బీజేపీని దేశం నుంచి పారదోలాలె.. తరిమి తరిమి కొట్టాలే.. అని పదే పదే పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రత్యామ్నాయ ఫలితాలు ఫలిస్తాయా..?? బెడిసికొడుతాయ?
తెలంగాణ రాజకీయాల్లో ఈ ఫలితాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
- మొన్నటి వరకు టీఆరెస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని చెప్పుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలలో తామే ఆల్టర్‌నేట్‌గా ప్రకటించుకుంది కాంగ్రెస్.
- కనీస స్థాయిలో కూడా కాంగ్రెస్‌కు సీట్లు రాక గల్లంతు కావడంతో ఆ పార్టీ తీవ్ర నిరాశ, నిస్పృహలో మునిగిపోయింది.
- పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీలో ఉత్సాహం పెరిగింది. మెంబర్ షిప్ డ్రైవ్ సక్సెసయ్యింది. కానీ జాతీయ రాజకీయాలు ఆ పార్టీని రాష్ట్రంలో కుంగదీసేలా – ఉన్నాయి.
- ఐదు రాష్ట్రాలో కనీసస్థాయిలో కూడా కాంగ్రెస్ పోరాట పటిమ చూపలేకపోయింది. ఉత్తరా ఖండ్‌లో కొన్ని సీట్లు… ఉత్తర ప్రదేశ్‌లో రెండు సీట్లు మాత్రమే రావడం తీవ్ర నిరాశకు గురి చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుకు పోయే అవకాశం..
- ఈ ఫలితాలు మోడీ చరిష్మా తగ్గలేదని నిరూపించాయి. యూపీ లో రైతుల ఉద్యమం కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఎదురుగాలి వీచిన చోట కూడా బీజేపీ విజయం సాదించింది.
- రాష్ట్ర కాంగ్రెస్‌కు నిరాశ మిగలగా.. బీజేపీకి ఉత్సాహం పెరిగింది.
- ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తాయని అనుకున్నారు. కానీ అందుకు విరుద్దంగా ఫలితాలు వచ్చాయి. పూర్తి ఆధిక్యంతో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
- ఆప్ జాతీయ పార్టీగా అవతరించగా.. ఎంఎఐం గల్లంతయ్యింది. బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు దీన్ని గుర్తించారు. ఢిల్లీ, పంజాబ్‌లో గెలిస్తే సరిపోయిందా..? అని తక్కవుగా చేసి చూసే పరిస్థితి లేదు. ఉత్తర భారతదేశంలో దీని ప్రభావం ఉంటుంది.
- ఈ ఫలితాలు బీఎస్పీకి కూడా శరాఘాతంగా మారాయి. బీజేపీ శిబిరంలో మరింత ఉత్సాహం నింపాయి.
ఏం చెబుతున్నాయి ఫలితాలు..
ఆమ్ ఆద్మీ జాతీయ పార్టీగా గుర్తించింది… ఉత్తర భారతదేశంలో మోడీ చరిస్మా తగ్గలేదని నిరూపించింది.
MM ROYAL