మెంటల్ అబ్యూస్ x పిజికల్ అబ్యూస్

ప్రతిష్టాత్మకం గా జరిగిన ఆస్కార్ అవార్డుల వేదిక మీద ఒక సంఘటన చోటు చేసుకుంది. వ్యాఖ్యాత గా ఉన్న క్రిస్ రాక్ అనేవాడు, ప్రముఖ హాలీవుడ్ నటుడు అయిన విల్ స్మిత్ భార్య మీద అబ్యూసివ్ గా జోక్ చేశాడు. ఆమెకి ఒక జబ్బు వచ్చింది దానివలన జుట్టు అంతా ఊడిపోతుంది అని గుండు చేపించుకుంది.

వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న కమీడియన్ క్రిస్ రాక్ ఆమె గురించి మాట్లాడుతూ అంతక ముందు గుండు తో నటించిన ఏదో మూవీ కి నీవు సీక్వెల్ లో నటిస్తున్నావా, నీ గుండు బాగుంది, ఐ లవ్ యూ అంటూ మాట్లాడాడు.

తన భార్య మెడికల్ కండీషన్ మీద మాట్లాడిన క్రిస్ రాక్ ని విల్ స్మిత్ చెంప దెబ్బ కొట్టాడు.

కొంత మంది పిజికల్ గా అలా కొట్టకూడదు అని ఇది హింస కింద వస్తుంది అని, ఇంకొందరు బాగా బుద్ది చెప్పాడు అని అంటున్నారు.

విల్ స్మిత్ పిజికల్ గా కొట్టినదానిమీద తర్వాత సంగతి; విల్ స్మిత్ చేసిన దానికి అతను క్షమాపణ చెప్పాడు, నేను ఎమోషనల్ అయ్యి అలా కొట్టాను, తప్పు నాదే, క్రిస్ రాక్ నన్ను క్షమించు అని క్లియర్ గా చెప్పాడు. మరి కమీడియన్ క్రిస్ రాక్ చేసిన మానసికమైన అబ్యూస్ ఒకేనా..?

పిజికల్ గా ఒక చెంప దెబ్బ కొడితే ఆ భాద 2 నిమిషాలే ఉంటుంది, మరి మానసిక మైన అబ్యూస్ సంగతి ఏంటి..? జబ్బుతో భాద పడుతూ తన కిష్టం లేకపోయినా గుండు చేపించుకున్న ఒక మహిళ మెడికల్ కండీషన్ మీద జోక్ వేసి అబ్యూస్ చేయటం లక్స పిజికల్ అబ్యూస్ ల కంటే ఎక్కువ భాద కలిగిస్తుంది.

బయటికి కనిపించే పిజికల్ అబ్యూస్ కంటే కనిపించని మానసిక అబ్యూస్ ఎక్కువ భాద కలిగిస్తుంది, ముందు ఆ కమీడియన్ గాడ్ని జైళ్ళో పెట్టాలి…! ఆడవాళ్ళ మీద జరిగే మానసిక అబ్యూస్, ఆడవాళ్ళు చేసే మానసిక అబ్యూస్ రెండిటికీ నేను వ్యతిరేకం. అబ్యూస్ ఏ రూపం లో ఉన్నా అందరూ ఖండించాల్సిందే; భౌతికమైనా, మానసికమైనా

చెంపదెబ్బ కొట్టిన 40 నిమిషాల కి ఉత్తమ నటుడిగా అవార్డ్ తీసుకున్నాడు విల్ స్మిత్. రీసెంట్ గా లియోనార్డో డీకాప్రియో కి, ఇప్పుడు విల్ స్మిత్ కి ఆస్కార్ అవార్డ్ రావటం ఆస్కార్ అవార్డ్ ల అకాడమీ కి గౌరవం.

– సామాన్యుడు

Jagannadh Goud