ఇటు అర్విందు, అటు బండి సంజయ్.. ఎలాగోలా పార్టీని లేపుదామని నానా తంటాలు పడ్డారు. సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకతను తమ ఖాతాలో వేసుకునేందుకు శత విధాలా ప్రయత్నం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ను పక్కకు నెట్టి.. తామే ఉన్నామని నిరూపించుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడేసుకున్నారు. వాస్తవానికి దాని బలం కూడా సోషల్ మీడియానే. అలా దూసుకుపోతున్న తరుణంలో.. అలా రెచ్చిపోతున్న సదర్భంలో.. అలా తమకు ఎదురులేదని విర్రవీగుతున్న సమయంలో.. . మోడీ మాటలు ఆ దూకుడుకు బ్రేక్ వేశాయి. మామూలుగా కాదు.. ఎవ్వరూ ఊహించనంత. అదేందీ… ఈ వ్యాఖ్యలు గతంలో కూడా చేశాడే. అప్పు్డు ఇంత రాద్దాంతం జరగలేదే.. అప్పుడు అలా తిట్టి ఇలా ఊకున్నారే… తమలపాకులతో కూడా కొట్టే ప్రయత్నం చేయలేదే..? ఇవన్నీ ప్రశ్నలు వచ్చాయి. బీజేపీ వాళ్లు కూడా కొందరనుకున్నారు ఇలాగే.
కానీ అప్పడు కేసీఆర్, మోడీకి మధ్య ఉన్న సంబంధాలు వేరు. కేసీఆర్ … కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వే పరిస్థితి లేదు. అలా చేయొద్దనుకున్నాడు. పని కానిచ్చేద్దామనుకున్నాడు. పనులు చక్కదిద్దుదామనుకున్నడు. కానీ మోడీ, షాల ద్వయం కేసీఆర్ను నమ్మరు. అలా సందర్బం వచ్చినప్పుడల్లా కాళ్లల్లో కట్టెలు పెట్టే పని చేస్తనే ఉన్నారు. యాసంగి వడ్లు , వరి వేయొద్దు… అనే కేంద్రం ఆంక్షలు ఇద్దరి మధ్య పెద్ద అగాథాన్ని సృష్టించాయి. రైతుల ముందు కేసీఆర్ను దోషిలా నిలబెట్టే ప్రమత్నం బీజేపీ చేసింది. ఇది తట్టుకోలేకపోయాడు కేసీఆర్. ఇంకేముంది ప్రత్యక్ష సమరానికి శంఖం వూదాడు. కానీ ఇంకా కొంత మంది కేసీఆర్ను నమ్మలేదు. కానీ క్రమేణా కేసీఆర్ మోడీపై దూకుడు పెంచాడు. కేంద్రాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా కడిగిపాడేశాడు. ఇలా మంచి ఊపులో ఉన్న సమయంలోనే.. మోడీ ఖర్మకాలి, బీజేపీకి దుర్దినాలు దాపురించి… రాజ్యసభలో అలా అన్నాడు. కాంగ్రెస్ను టార్గెట్ చేద్దామనుకుని తానే బొక్క బోర్లా పడ్డాడు.
టీఆరెస్కు ఇది చీకట్లో చిరుదివ్వెలా దొరికింది. అసలే అనేక సమస్యలతో ప్రభుత్వం సతమతమవుతోంది . ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నది. ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకవ పెరుగుతున్నది. నిధులు లేవు. సంక్షేమ పథకాల అమలులో వేగం తగ్గుతున్నది. నిరుద్యోగం, పింఛన్లకు డబ్బులు లేవు. కొత్త పింఛన్లు లేవు. నిదులెలా సమకూర్చుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. బీజేపీ దూకుడుగా ముందుకు పోతుంటే.. మోడీ అందిచ్చిన ఈ నోటిదూల అస్త్రం… టీఆరెస్కు వరంలా మారింది. ఎక్కడికక్కడ నిరసనలు. ఆందోళనలు. చోటా లీడర్ నుంచి మంత్రుల వరకు అంతా ఆందోళన బాట. ఇది సక్సెసయ్యింది. సెంటిమెంట్ మరోసారి రాజేసి వదిలేశాడు మోడీ. ఈ దెబ్బకు బీజేపీ ఎంపీల ముఖంలో నెత్తుటి చక్క లేదు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎలా ఆత్మ సంరక్షణ చేసుకోవాలో దిక్కుతోచలేదు.
ఆఖరికి మొన్న అర్వింధ్ తన ఫేస్బుక్ వాల్ పై దళితబంధు పథకం విషయంలో కేసీఆర్ను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ వల్గర్ భాషను వాడుతూ సినిమాలోని కొన్ని కామెడ్ సీన్లు యాడ్ చేసే ఓ మీమ్ చేసి వదిలాడు. అదే తన పాత పంథా తరహాలోనే. చాలా అగ్లీగా ఉందది. అగో అలాంటివే పాపం ఆ పార్టీకి మళ్లీ మైలేజీ ఇస్తాయని వారి ఆశ. దురాశ. పేరాశ.
ఈ ఎపిసోడ్లో వెనుకబడి… ఏమీ చేయలేక చేష్టలుడిగి చూస్తుండిపోయింది కాంగ్రెస్. తొలత రేవంత్ ఈ సబ్జెక్టును ఎత్తుకుని ఏదో చేసినా.. ఆ తర్వాత కాంగ్రెస్ దీన్ని కంటిన్యూ చేయలేకపోయింది. కాడెత్తేసింది.