“చిన్నారుల పై కరోనా పంజా . మొదటి రెండు వేవ్ ల కు బిన్నంగా ఇప్పుడు కరోనా చిన్నారుల పై పంజా విసురుతోంది . నిలోఫర్ ఆసుపత్రిలో ఇరవై మంది దాకా పిల్లలు జ్వరం , విరేచనాల తో చేరారు . మున్ముందు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది”- ఇదీ వార్త .

ఇందులో నిజం ఎంత ? అబద్దం ఎంత ?

రెండో వేవ్ ముగిసే నాటికి దేశం లో డెబ్భై శాతం పిల్లలకు కరోనా సోకినట్టు ప్రభుత్వం నిర్వహించిన సిరో సర్వే లో వెల్లడైంది . అంటే కొన్ని కోట్ల మంది పిల్లలు డెల్టా వేవ్ ముగిసే నాటికే కరోనా బారిన పడ్డారు . మనిషన్నవాడికి , ముక్కున్న వాడికి కరోనా సోకుతుంది . పిల్లలకు కూడా ముక్కుంటుంది కదా ? సోకకుండా ఎలా వుంటుంది ? సోకుతోంది . ఒకటి రెండు రోజుల జ్వరం , విరేచనాలతో కోలుకొంటున్నారు . పిల్లలకు కరోనా లక్షణాలు కనిపిస్తే మల్టీ విటమిన్ సిరప్ , జ్వరం ఉన్నప్పుడు పారాసెటమోల్ సిరప్ ఇస్తే సరి పోతుంది . విరేచనాలు అవుతున్నప్పుడు కొబ్బరి నీరు , మజ్జిగ లాంటివి ఇవ్వాలి . అరటి పండు , నానపెట్టిన బాదాం ఇవ్వాలి . ఆరు నెలల లోపు పిలల్లకు తల్లి పాలు చాలు .

మరి ఆందోళన తో తల్లితండ్రులు ఆసుపత్రులకు ఎందుకు పరుగెత్తుతున్నారు ?

భయపెట్టే వార్తలు చదివిన వారు .. పంజా , కరాళ నృత్యం లాంటి మాటలతో బెంబేలెత్తి ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు . పాపం కడుపు తీపి . తమకు ఏమైనా పరవా లేదు . తమ బిడ్డకు ఏమీ కాకూడదు అనే తపన . సరిగ్గా ఆ సెంటిమెంట్ పై జరిగే మెడికల్ మార్కెటింగ్ .

కరోనా విషయం లో వాస్తవాలను గ్రహించిన వారు బేఫికర్ . ఇంకా మాయా ప్రచారాన్ని నమ్మిన వారు, దోపిడీ కి గురవుతూనే వున్నారు . ఆస్తులు పోగొట్టుకోవడం అంతకు మించి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం జరుగుతోంది .

అంటి బాడీ కాక్టెయిల్ ట్రీట్మెంట్ అంట .. అరవై అయిదు వేలు .. పిండా కూడు ఏమీ కదా ? సన్నాసి ! మినిమం కామన్ సెన్స్ ఉండొద్దు .? దాన్ని డెల్టా కోసం చేసారు . ఇప్పుడున్నది ఓమిక్రాన్ . ఆ అంటి బాడీ లు పనికి రావు . అందుకే కదా రెండు బూస్టర్ డోసులు వేసుకున్నా సోకుతోంది . మరలాంటప్పుడు యాంటీబోడీ కాక్టైల్ ఎలా పని చేస్తుంది ? నీది ప్రాణ భయం . వారిది డబ్బు యావ . పంజా.. విజృంభణ అంటూ ప్రచారం . లాగెత్తుకొని వెళ్లి ఆసుపత్రిలో చేరి లక్ష సమర్పించుకొని రావడం .. నేను ఫలానా ఆసుపత్రిలో ఇలా చేశాను అంటూ ఫేస్బుక్ లో పోస్టింగ్ . దాన్ని చూసి మరో నాలుగు బకరాలు .

వ్యాధి విస్తరిస్తున్నప్పుడు , వేవ్ ఉన్నప్పుడు వాక్సిన్ ఏంట్రా ? అదేమైనా మందా ? కరోనా సోకినవాడికి కొన్ని రోజులపాటు వాక్సిన్ ఇవ్వకూడదు అని కేంద్ర ప్రభుత్వం తన వెబ్ సైట్ లో చెప్పింది . కనీసం దాన్నైనా చూడలేదా ?

వారం క్రితం నాకు రోజూ” సర్.. ఈ వ్యాధి లక్షణాలు వున్నాయి. ఏమి చెయ్యాలి?” అనే మెసేజ్ లు తొంబై శాతం . ఇప్పుడు ఇలాంటి మెసేజ్ లు యాభై శాతానికి తగ్గాయి .” సర్ .. ఇంట్లోనే ఉంటూ మీరు చెప్పన పద్దతిలో కోలుకున్నాము” అని వరదలా వస్తున్నా మెసేజ్ లు . ఒక్కో కుటుంబానికి వేల రూపాయిల అదా . అంతకంటే మించి టెన్షన్ లేని స్థితి

.ఇంగిత జ్ఞానం ఉన్న వాడికి లేని వాడికీ ఇదీ తేడా !

ఆఫ్రికా దేశాలు , ఆసియా లోని పాకిస్థాన్ , బాంగ్లాదేశ్ , శ్రీలంక లాంటి అనేక దేశాలు ప్రారంభం నుంచి కరోనా ను పెద్దగా పట్టించుకోలేదు . పట్టించుకొన్న దేశాలు యూరోప్, అమెరికా , సింగపూర్ లాంటివి మాత్రమే . కరోనా ఇక పై మామూలు జలుబు లాంటిదని యూరోప్ దేశాలు చెప్పేస్తున్నాయి .

ఇక ప్రధానంగా మిగిలింది ఇండియా మాత్రమే . ఇక్కడ మాత్రం మెడికల్ మాఫియా మార్కెటింగ్ నిస్సిగ్గుగా సాగుతోంది . రెండు నెలల కింద దక్షిణాఫ్రికా” ఓమిక్రాన్ అంత డేంజర్ కాదు” అని చెప్పినప్పుడు ” ఆబ్బె ఆలా చెప్పలేము . అది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది . ఏది ఏమైనా డేంజర్ .. అసలు వైరస్ శరీరం లోకి పోవడం డేంజర్ కదా ?” అని బుకాయించారు . “చూడండి ఇంగ్లాండ్ లో ఫ్యాన్స్ లో ఇన్ని లక్షల మందికి సోకుతోంది” అని చెప్పారు . “ఇదిగో లాక్ డౌన్ అదిగో లాక్ డౌన్” అని హోరెత్తించారు . ఇప్పుడు ఇంగ్లాండ్ లాంటి యూరోప్ దేశాలు కరోనా కట్టడి ని తీసేస్తే , ఢిల్లీ లో కర్ణాటక లో నైట్ కర్ఫ్యూ తీసేస్తే అసలు వార్తలకు ప్రాధాన్యం లేకుండా చూస్తారు .

ఆబ్బె జనాల్లో భయం లేకపోతె ఎలా ? జనాల్లో భయం ఉంటేనే కరోనా కంట్రోల్ లోకి వస్తుంది .. అందుకే మేము జనాలను ఎడ్యుకేట్ చేస్తున్నాము అంటూ తమ మెడికల్ మాఫియా మార్కెటింగ్ కు కవరింగ్ ఇచ్చుకొంటారు . డెల్టా వేవ్ అయిపోయేటప్పటికే దేశం లో తొంబై శాతం మందికి సోకింది . ఇప్పుడు మరింత విస్తృత స్థాయిలో ఓమిక్రాన్ . కట్టడి .. కాకరకాయ .. ఒట్టిపోలు కబుర్లు అని ఎప్పుడో తేలిపోయింది . 265 రోజులు స్ట్రిక్ట్ లాక్ డౌన్ పెట్టి కరోనా కేసుల్ని కంట్రోల్ చేసిన ఆస్ట్రేలియా లాక్ తీసేసేనాటికి కేసుల విషయం లో ఎక్కడో 150 వ స్థానం లో ఉండేది . ఇప్పుడు రోజుకు లక్ష కేసులతో ముప్పైవ స్థానానికి దూసుకొని వచ్చేసింది . అదీ విషయం

కనీసం డెల్టా వేవ్ సమయం లో ఒక లెక్క . అది కొంత ప్రమాద కరమైన వేరియెంట్ . ఇప్పుడు వున్నది ఓమిక్రాన్ . కేసులు కోట్ల లో .. ఆసుపత్రి బెడ్ లు ఖాళీ .. అసలు ఓమిక్రాన్ శోకించుకొని నాచురల్ ఇమ్మ్యూనిటి పొందిన వాడు సేఫ్ . లేక పొతే రేపు నిజంగానే ప్రమాదకర వేరియెంట్ వస్తే ఈ బూస్టర్ లు ఎమీ ఉపయోగపడవు . వాటి వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటే అది ఫార్మసురులకే . సైడ్ ఎఫెక్ట్స్ తో జనాలు ఆసుపత్రులకు . వారికి డబ్బులు .. వీరికి జబ్బులు .

ప్రచార యుద్ధం .. గోబెల్స్ ప్రచారం అనేది పాతమాట. మెడికల్ మాఫియా కరోనా ప్రచారం అనేది కొత్త మాట .

(Amarnath Vasireddy)

You missed