ఇప్పుడిదో ట్రెండ్. పేరు జర్నలిజం. తమకు కావాల్సిందే చెప్పాలి. మాట్లాడాలి. ఏది చెప్పాలనుకుంటున్నామో అదే చూపాలి. చెప్పించాలి. అంతే తప్ప ప్రజలకు ఏం కావాలనేది కాదు ముఖ్యం. యూట్యూబ్ చానెళ్లు, వెబ్సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన తర్వాత ఇలా ఎవరికి తోచించి వారు అడిగేస్తున్నారు. ఫేమస్ అయిపోదామని తమ మేథావితనాన్నంతా చూపించి వెర్రోళ్లుగా కూడా అవతారమెత్తుతున్నారు. కడుపుమంటను రాజేసేకుంటున్నారు. అదే తెలివని అనుకుంటున్నారు.
జర్నలిస్టులం కాబట్టి.. మాకు అపారమైన జ్ఞానం ఉంటుందని భ్రమ పడి బొక్కబోర్లా పడుతున్నారు. అయినా.. తగ్గేదేల్యా అని తమను తాము సమర్థించుకుని ఇలా అదేముందుకు పోతున్నారు. ఐడ్రీమ్స్ చానెల్లో పనిచేస్తున్న యాంకర్ అంజలి పాపం ఇలా తన మేథావితనాన్ని చూపి బుక్కయిపోయింది. అదీ తెలంగాణ మీద. అదేమదో ఇంటర్వ్యూ తీసుకుంటున్నది. ఆ సబ్జెక్టు తగ్గట్టే ప్రశ్నలడిగినట్టు కనిపించింది.
రాష్ట్రాలు, భౌగోళిక స్వరూపము అని సబ్జెక్టు రాగానే తన ఆంధ్ర తెలివి చూపింది. అసలు తెలంగాణ ఏర్పడింది ఎందుకు..? వచ్చి ఏం సాధించారు..? అని కడుపులో మంటతో కక్కేసింది. ఏదో ఆన్సర్ రాబడదామనుకున్నది. అది రాలేదు. ఇంకా రెచ్చిపోయింది..కానీ లాభం లేదు. ఆమే అన్నది మళ్లీ.. తెలంగాణ జిల్లాల్లో రోడ్లు సరిగా లేవు అని. మరి ఇన్నాళ్లూ పాలించింది ఆంధ్రోళ్లే కదమ్మా.. అది మరిచిపోయింది. ఉత్తినే ఏదో విషం కక్కాలి అనే గానీ, ఆ ప్రశ్నల్లో దమ్ము లేదు. విషయం లేదు. అసలు అడిగిన ఆమెకే విషయం లేదని తెలిసిపోయింది. తేలిపోయింది. నవ్వులపాలైంది. పూనకం వచ్చినట్టు.. అపరిచితుడు ఆవహించినట్టు.. ఊగిపోయింది. ఆఖరికి సొమ్మసిల్లి పడిపోయింది. తిట్ల దండకం నడుస్తున్నదిప్పుడు సోషల్ మీడియాలో…