ఓమిక్రాన్ తో కేవలం మైల్డ్ లక్షణాలే అని దక్షిణాఫ్రికా డాక్టర్ లు చెబుతున్నారు . ఇప్పటిదాకా ఓమిక్రాన్ తో ఒక్కరు కూడా చనిపోలేదని సాక్షాత్తూ ప్రపంచ అనారోగ్య సంస్థే చెప్పింది .
ముందుగా ఓమిక్రాన్ అంటేనే హడలెత్తించేలా ప్రచారం .. చివరికి ఈ మాయ రోగానికి ఒక మందు . వామ్మో .. ఏమి మాయ లోకం రా దేముడా ?
అశ్వత్థామ అథః అన్నట్టు చివరిగా వారు చెబుతుందేమిటంటే తేలికపాటి నుంచి మోస్తరు ఇన్ఫెక్షన్ కు ఇది పని చేస్తుందట ! తీవ్ర ఇన్ఫెక్షన్ గురించి చెప్పలేరట .
మీ కంటికి జనాలు మరీ అంత బకరాలుగా కనిపిస్తున్నారా ? నిజమే మీరు చెప్పిన సోదిని కోట్లాది మంది నమ్ముతున్నారు . కానివ్వండి . అయినకాడికి దోచెయ్యండి . బందిపోట్లు అయినా కట్టుబట్టలతో వదిలేస్తారు . మీరు గోచి కూడా మిగిల్చేలా లేరు .
AMARNATH VASIREDDY