శ్రీ సిగ్మా ఆస్పత్రిలో అత్యాధునిక పరికరాలతో మెరుగైన వైద్యం…
– ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ క్రిష్ణకిషోర్ రెడ్డి..
నిజామాబాద్ : జిల్లా ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్ పరుగులు తీసే అవసరం లేకుండా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా సోమవారం (రేపటి నుంచి ) ప్రారంభం కానున్న శ్రీ సిగ్మా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలతో మెరుగైన వైద్యం అందబోతున్నదని ఆస్పత్రి డైరెక్టర్, గుండె వైద్య నిపుణులు క్రిష్ణ కిషోర్ రెడ్డి తెలిపారు. సోమవారం రోజున జిల్లా కలెక్టర్ సీ నారాయణ రెడ్డి, ఐఎంఏ బాధ్యులు, ప్రముఖ వైద్యల సమక్షంలో ఈ ఆస్పత్రి ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఆయయన వాస్తవం రిపోర్టర్‌తో ఆదివారం మాట్లాడారు.
అత్యవసర సేవలకు అంబులెన్సులు అందుబాటులో ఉంచి, ప్రైమరీ స్టంటింగ్, బెలూన్ సర్జరీలు విజయవంతంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గుండె వైద్యంతో పాటు ఇతర విభాగాలైన వెన్నుపూస, మెదడు, లేజర్, కాటరాక్ట్, కోత లేకుండా లాపరోస్కోపీ ద్వారా గర్బసంచి, గాల్ బ్లాడర్ తదితర 40 వరకు శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ వెళ్లి లక్షలు వెచ్చించే అవసరం లేకుండా సామాన్యులకు సైతం తక్కువ ధరలకు మెరుగైన వైద్య పరీక్షలు, చికిత్స చేసేందుకు అన్ని విధాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా ప్రజలతో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, నిర్మల్ జిల్లా ప్రజలకు సైతం ఈ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్నవాటిల్లో స్త్రీ వైద్య నిపుణులు, లాప్రోస్కోపీ, ఆఫ్తామాలజీ, క్రిటికల్ కేర్, ఇంటర్నల్ మెడిసిన్, గుండె వైద్య నిపుణులు, న్యూరో విభాగాలు అందుబాటులో ఉన్నాయన్నారు.