ధర్నా చౌక్ అనే పేరు ఉచ్చరించడానికే మీడియాకు ఉచ్చపడుతుంది. ఎందుకంంటే కేసీఆర్ అక్కడ ధర్నా చౌక్ ఉండటం ఇష్టం లేదు. దాన్ని లేపేయాలని కంకణం కట్టుకున్నడు. ఓ ప్రెస్‌మీట్‌లో ఇదే చెప్పిండు. ఏడ బడితే ఆడ చేసుకోవచ్చు కదా.. ఆడనే చేయాల్న.. అన్నడు. కానీ ఉద్యమకారులు కొట్లాడి కాపాడుకున్నరు. ఇగో ఇప్పుడ ఆడనే కూసుని మహాధర్నాలో పాల్గొన్నడు కేసీఆర్. కానీ మన మీడియా కేసీఆర్ మనసెరిగి నడుచుకుటుంది కదా. ఆయన ఆకాంక్షలకు, అభీష్టాలకు వ్యతిరేకంగా పోయి బతికి బట్టకమని తెలుసు కదా. లోకజ్ఞానం తెలిసిన మీడియానాయే. అందుకే లైవ్ కవరేజీలో ఆ స్థలాన్ని ఇందిరాపార్క్ అనే పెట్టుకుని చంకలు గుద్దుకున్నయి. దాన్ని ధర్నా చౌక్ అని అనడానికి సాహించలేదు. ధైర్యం చేయలేదు. మాది చేవచచ్చిన మీడియా అని చెప్పుకున్నాయి ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరోక్షంగా.