జర్నలిస్టుగా తీన్మార్ మల్లన్న పేరుతో మొన్నటి వరకు చెలామణి అయిన చింతపండు నవీన్.. ఎట్టకేలకు తన ముసుగు తీశాడు. తీన్మార్ మల్లన్నపెట్టుడు పేరుతో.. జర్నలిస్టు అనే ముసుగుతో ఇన్నాళ్లూ చలామణి అయ్యాడు.ఇటు జర్నలిస్టుల సపోర్టు లేదు.. అటు లీడర్ల సపోర్టు లేదు. చివరికి తత్వం బోధపడినట్టుంది. ఇక పార్టీ తీర్థం పుచ్చుకని వన్‌సైడ్ కావాలనుకున్నట్టున్నాడు.
ఎంచుకోగా.. ఎంచుకోగా.. బీజేపీ ఒక్కటే చింతపండుకు కనిపించింది. అర్వింద్‌తో అప్పటికే సన్నహిత సంబంధాలున్నాయి. ఒకరితో ఒక విధంగా.. మరొకరితో మరొక విధంగా వ్యంగ్యంగా మాట్లాడుతూ.. కొత్త జర్నలిజనానికి కొత్త బాటలు వేశాడు నవీన్.ఈ వెటకారపు వికారపు మాటలు చాలా మందికి నచ్చలేదు. కొంత మంది ఎంజాయ్ చేశారు. కానీ మొన్నటి జైలు ఎపిసోడ్‌తో నవీన్‌కు తత్వం బోధపడినట్టుంది. ఇక తెర వెనుకు ఇక తైతక్కలేందని అనుకున్నాడో.. ఇంత జరిగినా ఇక జర్నలిస్టుగా చెలామణి అవ్వడం కుదరదని అనుకున్నాడో తెలియదు.. కానీ మొత్తానికి బీజేపీలో చేరాలనే ఓ నిర్ణయం తన క్యూ న్యూస్ ద్వారా అనౌన్స్ చేశారట.
అతను ఇప్పుడు రిమాండ్‌లో ఉన్నాడు. మొన్నటి వరకు కాంగ్రెస్ నవీన్‌ను తను ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. తర్వాత మొన్న అర్వింద్ తను నాలుగు సార్లు కలవాలని జైలుకు వెళ్లినా.. అక్కడ పోలీసు అధికారులు పట్టించుకోలేదని సోషల్ మీడియా పోస్టు చేశాడు. ఇది కూడా వివాదమయ్యంది. కానీ నవీన్ తను బీజేపీలో చేరుతానని ప్రకటించి ఈ వివాదానికి తెర దించాడు. ప్రొటెక్షన్ కోసం బీజేపీలో చేరుతున్నాడని మరో వాదన. ఎవరి రక్షణ వారికి. ఎవరి ఎదుగుదల వారిది. ఎవరి నిర్ణయం వారి ఇష్టం.
