హుజురాబాద్ పై కేసీఆర్ ప్ర‌త్యేక న‌జ‌ర్ పెట్టాడు. ఈ రోజు హ‌రీశ్‌తో ప్ర‌త్యేకంగా భైటీ అయ్యి అక్క‌డి ప‌రిస్థితుల పై స‌మీక్షించాడు. ఇంట‌లిజెన్స్ రిపోర్టు, స‌ర్వేల ఆధారంగా ఇంకా అక్క‌డ ప‌రిస్థితులు ఈట‌ల‌కు మొగ్గు చూపుతున్నాయ‌న్న విష‌యాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోయాడు. నోటిఫికేష‌న్ రేపు విడుద‌ల కానున్న నేప‌థ్యంలో, ఎన్నిక‌ల‌కు ఇంకా నెల‌రోజులు ఉన్న సంద‌ర్భంలో ప‌రిస్థితిని పూర్తిగా త‌మ వైపు తిప్పుకునేందుకు నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగాడు. దాదాపు మూడు నెల‌ల నుంచి అక్క‌డ టీఆరెస్ శ‌క్తుల‌న్నీంటిని మోహ‌రించింది. హ‌రీశ్‌ను ఇంచార్జీగా వేసి వార్ వ‌న్‌సైడ్ అయ్యేలా అహ‌ర‌హం శ్ర‌మిస్తోంది.

శక్తి వంచ‌నా లేకుండా టీఆర్‌స్ శ్రేణులు పోరాడుతున్నారు. కానీ ఇంకా ఈట‌ల‌కే గెలుపు అవ‌కాశాలు ఉన్నాయ‌నే సంకేతాలు టీఆర్‌స్ శిబిరంలో క‌ల‌వ‌రం రేపుతున్న‌ది. అందుకే ఇక కేసీఆర్ క‌ద‌న‌రంగంలోకి దిగాడు. ప‌రిస్థితిని స‌మీక్షించాడు. ఈ నెల రోజులు ఆయ‌న దృష్టంతా హుజురాబాద్ వైపే. ఈట‌ల‌ను లెవ్వ‌నివ్వ‌కుండా దెబ్బ‌కొట్టి, భూస్థాపితం చేయ‌డ‌మే పని. రేపటి నుంచి హుజురాబాద్ ఎ