టీఆరెస్ జిల్లా అధ్యక్ష పదవి నియామకం చేపట్టేందుకు ఎమ్మెల్యేలు ఇంట్రస్ట్ చూపుతున్నారట. రెండోసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడంతో ప్రజల్లో చాలా మంది వ్యతిరేకత కూడగట్టుకున్నారు. వచ్చేసారి టికెట్ చాలా మందికి డౌటే. వారంతా ఇప్పుడు కొత్త పన్నాగం పన్నుతున్నారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీలు పడుతున్నారు. తాము జిల్లా ప్రెసిడెంట్‌గా చేసేందుకు సముఖంగా ఉన్నామని కేటీఆర్‌కు కబురు పంపుతున్నారు. కొందరు నేరుగా వెళ్లి కలుస్తున్నారు. ప్రసెడింగ్‌గా పక్కాగా, పర్‌ఫెక్ట్‌గా పనిచేసి మంచి పేరు తెచ్చిపెడతామని నమ్మబలుకుతున్నారు.
మూడో సారి టికెట్ రావడం కల్లే అని భావించిన వారంతా ఇదే పంథాను అనుసరిస్తున్నారంట. ఇలాగైనా.. తమకు మూడోసారి టికెట్ వచ్చే అవకాశాలుంటాయని వారి అంచనా. ఎందుకంటే… జిల్లా అధ్యక్షుడి చేస్తే.. పార్టీతో మరింత రాపో పెంచుకోవడంతో పాటు కేటీఆర్‌తో దగ్గర కావచ్చనే భావనలో వారున్నారు. దీంతో అప్పటి వరకు మూటగట్టుకున్న వ్యతిరేకతను వచ్చే ఎన్నికల నాటికి మొత్తం పోగొట్టుకుని.. మళ్లీ ఎమ్మెల్యేకు పోటీ చేయవచ్చనేది వారి ఆలోచన. కానీ, కేటీఆర్ వీరందరికీ నిక్కచ్చిగా చెప్పాశాడంట… ఎమ్మెల్యేలకు నో ఛాన్స్ అని. దీంతో వీరంతా పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయి.
వాస్తవంగా ప్రెసిడెంట్ ఎన్నిక ఈనెల 20నే జరగాలి. కానీ జాప్యం జరుగుతూ వస్తుంది. ఈలోపు అసెంబ్లీ సమావేశాలు వచ్చాయి. వచ్చే నెల 5 వరకు సమావేశాలున్నాయి. అప్పటి వరకు ఇదిఎటూ తేలేలా లేదు. సమావేశాలు ముగిశాకే కేటీఆర్ ఈ ప్రక్రియపై సీరియస్‌గా దృష్టిపెట్టేలా ఉన్నాడు. అప్పటి వరకు ఎవరు ప్రెసిడెంటో ఉత్కంఠ కొనసాగుతోంది.