కొత్త క‌లెక్ట‌రేట్ల‌ను ఆర్భాటంగా క‌ట్టారు. కోట్లు పెట్టారు. ఒకే న‌మూనా అన్నిచోట్ల‌. చూడ‌గానే అబ్బుర‌ప‌డే అందం ఆ డిజైన్ల‌ది. అన్ని డిపార్టుమెంట్లని ఒకే గొడుగు కింద‌కు తీసుకువ‌చ్చి క‌ట్టారు. అంతా బాగానే ఉంది. కానీ స్థ‌లం ఎంపిక‌, ఆ స్థ‌లాల‌లో క‌ట్టిన విధాన‌మే పూర్తిగా లోప‌భూయిష్టంగా ఉంది. ఉన్న స్థ‌లాన్ని నేల‌మ‌ట్టానికి చాలా పైకి లేపాలి. కానీ అప్ప‌టికే రోడ్డుకు లోతుల్లో ఉన్న భూమిని బాగా పైకి లేప‌లేక‌పోయారు. ఇది కాంట్రాక్ట‌ర్ల త‌ప్పిదం. వారిని ఆజ‌మాయిషీ చేయ‌లేని ఆర్అండ్‌బీ అధికారుల త‌ప్పిదం.

ఏమ‌న్నా అంటే.. పాపం అప్పటికే వాళ్లు చాలా పైకి లేపారండి. చాలా మొరం పోశారు. రెండు మూడు మీట‌ర్లు లేపారు. ఇంకే లేపుతారు..అని స్వ‌యంగా ఆర్అండ్‌బీ అధికారులే వెనుకేసుకొస్తున్నారంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. అంతా రెడీ అయి ప్రారంభానికి ముస్తాబై ఉన్న ఈ ఇంటిగ్రేటెడ్ క‌లెక్ట‌రేట్లు.. వ‌రుస‌గా కురుస్త‌న్న వ‌ర్సాల‌కు నిండిపోయి జ‌ల‌మ‌య‌మ‌వుతున్నాయి.

ఈ నీటిని బ‌య‌ట‌కు పంపేందుకు దానికెదురుగా ఉన్న డాంబ‌ర్ రోడ్ల‌ను అడ్డంగా తవ్వేశారు కూడా. అంటే అప్ప‌టికి ఆ ప‌రిస్థితిని బ‌య‌ట ప‌డే మార్గం మాత్రం చూసుకున్నారు. ఇక ఎప్పుడు బాగా వ‌ర్షం ప‌డినా ఇంతే సంగ‌తుల‌న్న‌మాట‌. ఏడ సార్‌.. బిల్లులే స‌రిగా ఇవ్వ‌లేదు.. వాడు ప‌ని చేసేందుకే నానా తంటాలు ప‌డ్డాడు అని అంటారు ఏమ‌న్న అంటే అధికారులు. అంటే బిల్లులు స‌కాలంలో రాలేద‌ని, ఇలాఇష్ట‌మొచ్చిన‌ట్టు క‌ట్టినా ప‌ర్వాలేద‌న్న‌మాట‌. స‌రే కానీ అలాగే. వ‌ర్షాలొచ్చిన‌ప్ప‌డు నీళ్ల‌ను తోడేందుకు జ‌న‌రేట‌ర్ల‌ను ఏర్పాటు చేసుకోండి మ‌రి.