ప్ర‌స్తుతం మారుతున్న మాన‌వుని జీవ‌న‌శైలిలో భాగంగా షుగ‌ర్ వ్యాధి అనేది ప్ర‌తి ఒక్క‌రికి కామ‌న్‌గా మారింది. 30 ఏండ్ల నుంచే మ‌ధుమేహం వ్యాధిన ప‌డుతున్నారు. షుగ‌ర్ రాగానే ఒక్క‌సారిగా ఆహార‌పు అల‌వాట్ల‌ను మార్చుకుంటున్నారు. అప్ప‌టి వ‌ర‌కు అన్న‌మే పూజిస్తూ బ‌తికిన జ‌నాలు గోధుమ రొట్టెల‌ను అల‌వాటు చేసుకున్నారు. వైద్యుల సూచ‌న‌ల మేర‌కే ఇలా చేస్తున్నామ‌ని చెబుతున్నారు. కానీ మ‌న శ‌రీరం చిన్న‌ప్ప‌టి నుంచి తినే ఆహార‌పు అల‌వాట్ల‌కే సెట్ అయ్యి ఉంది. ఒక్క‌సారిగా ఈ క్ర‌మాన్ని మారిస్తే లేని కొత్త రోగాలు వ‌స్తాయే త‌ప్ప అనుకున్న ల‌క్ష్యం నెర‌వేర‌దు. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఇదే చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. ఒక వ్య‌క్తి తాను ఉన్న ఫ‌లంగా భోజ‌నం మానేసి గోధుల రొట్టెలు తింటున్నాన‌ని ఏం ఫ‌ర‌వాలేదంటూ పోస్ట్ చేశాడు. దీనికి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ముర‌ళీమోహ‌న్ రావు ఇల‌పావులూరి ఈ విధంగా స్పందించాడు…
————————————————————————————————————————————————————————————————————————

అనుభవపూర్వకంగా చెబుతున్నాను. వాట్సాప్, ఫేస్బుక్ లో కనిపించే పనికిమాలిన వ్యాసాలకు ప్రభావితులు కావద్దు. ఆహరం విషయంలో డాక్టర్లు చెప్పే సలహాలు అసలు వినవద్దు. మన ఒంటి తీరు, వాతావరణం బియ్యానికి సరిపోతుంది. గోధుమలు, రాగులు, సజ్జలు, కొర్రలు లాంటివి తీసుకోవడం అనారోగ్యానికి హేతువు అవుతుంది. కావాలనుకుంటే బ్రౌన్ రైస్ తీసుకోండి. గోధుమలు విపరీతమైన వేడి చేస్తాయి. మిల్లెట్లు మనిషిని శక్తిహీనం చేస్తాయి. శుభ్రంగా వరి అన్నం తినేవారికి ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. ఇది ఒక ప్రసిద్ధ డాక్టర్ నాతో ప్రయివేటుగా చెప్పిన విషయం. రోగులకు మాత్రం వేరేగా చెబుతారు. అందుకు వేరే కారణాలు ఉన్నాయట! నా అనుభవం కూడా అదే.

 

You missed