2015-2016 లో తెలంగాణ వరి పంట సాగు విస్తీర్ణం 130 లక్షల ఎకరాలు అయితే 2020-2021 లో 209 లక్షల ఎకరాలకు పెరిగింది అంటే అదనంగా 79 లక్షల ఎకరాల్లో వరి పంట విస్తీర్ణం పెరిగింది
వరి పంట వేయాలంటే సాగు నీటి అవసరం ఎక్కువ ఉంటుంది గడచిన అరేళ్లలో అదనంగా 79 లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం పెరిగింది అంటే దానర్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల వ్యవస్థను మెరుగు పరచిందని అర్థం..
సాగు నీటి పారుదల వ్యవస్థ మెరుగు పడింది అని సంబర పడాలో పెరిగిన సాగునీటి వసతి వల్ల రైతులు ఒకేరకమైన పంట (వరి) పండించడానికి మొగ్గు చూపుతున్నందుకు కొంత ఆందోళనకి గురి కావాలో అర్థం కాని వింత పరిస్థితి ఏర్పడింది…
ఒకే రకమైన పంట వేయడం వల్ల మార్కెట్ లో ఆ పంటకు డిమాండ్ పడిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోతారు ఒకవైపు సాగునీటి వసతి కల్పించబడ్డ రైతులు ఆర్థికంగా నష్టపోతారు అంటే దానికి కారణం ముమ్మాటికి ఒకే తరహా పంటలు పండించడానికి రైతులు అలవాటు పడడమే…
మిగతా పంటలకు అయ్యే పెట్టుబడి ఖర్చుల కంటే వరి పంట సాగుకు అయ్యే పెట్టుబడి ఖర్చు తక్కువ అందుకే ఈ పరిస్థితి నెలకొంది అలాగే రైతులకు పంట మార్పిడి పద్ధతుల పైన పూర్తి స్థాయి అవగాహన కల్పించడం లో మనం విఫలం అవుతున్నాం గతం లో తెలంగణా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం అమలులోకి తెచ్చినప్పుడు కొన్ని రాజకీయ పరిస్థితుల నడుమ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకనో నియంత్రిత సాగు విధానం పైన వెనక్కి తగ్గింది..
అలాగే ప్రభుత్వాలు కేవలం సాగునీటి వసతుల పైన మాత్రమే దృష్టి పెట్టడం అలాగే మిగతా పంటలు ఉదాహరణకు కూరగాయల సాగు ఇతర వాణిజ్య పంటలకు అవసరం అయిన పెట్టుబడి ని తగ్గించే మార్గాలు అన్వేషించడం లో విఫలం అవడం లాంటి ముఖ్య కారణాల వల్ల రైతులు వరి పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు అనేది వాస్తవం..
అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిని తగ్గించే ఉద్దేశంతో ఇస్తున్న రైతు బంధు సాయాన్ని కూడా రైతులు ఎక్కువగా వరి పంటలు వేయడానికే ఉపయోగిస్తుండడం విచారకరం..
ఒకప్పుడు పెసర్లు మినుములు పొద్దుతిరుగుడు పల్లి లాంటి పంటలు విస్తారంగా కనిపించేవి ఇప్పుడు చూద్దాం అంటే వాటి జాడే కనిపించడం లేదు రైతులు ఒకే రకమైన పంటలు వేసి నష్ట పోకుండా అటు ప్రభుత్వ యంత్రాంగం ఇటు అధికార యంత్రాంగం మరింత కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది.
Srinivas sarla