అతను మహేందర్‌రెడ్డి. ఎన్నో సార్లు రక్తదానం చేశాడు. కరోనా సమయంలో ప్లాస్మాదానం చేశాడు. ఇతడికి స్పూర్తి సీపీ సజ్జనార్. కరోనా అందరి ప్రాణాలు తోడేస్తున్న వేళ సజ్జనార్ చేసిన సేవలను ఆయన దగ్గరగా చూశాడు. అప్పటి నుంచి విపరీతమైన అభిమానం ఏర్పర్చుకున్నాడు. ఎక్కడెకళ్లినా తన మిత్ర బృందంతో ఇదే విషయం చెప్పేవాడు. సార్ చాలా గ్రేట్‌రా.. ఆయన ను చూసి మనం నేర్చుకోవాలి. సమాజానికి మేలు చేయాలని చెప్తుండేవాడు. ఓ రోజు ఆయన బదిలీ అయిన విషయం తెలిసింది. అంతే ఒక్కసారిగా ఏడుపు ఆపుకోలేకపోయాడు. తన్నుకొస్తున్న కన్నీళ్లను కంట్రోల్ చేయడం తన తరం కాలేదు. చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎన్నో వేదికల మీద ఎంతో మందికి స్పూర్తిదాయకమైన ప్రసంగాలిచ్చి అందరినీ జాగృతం చేసే మహేందర్ రెడ్డి.. సజ్జనార్ సార్ బదిలీ అయిపోయారనగానే బేలగా బోరుమన్నాడు. దీన్ని తోటి మిత్రులు వీడియో తీసి సజ్జనార్ సార్‌కే పంపారట.