త‌న దారిన తాను వెళ్తున్న ఓ అంద‌మైన అమ్మాయికి.. ఆక‌స్మాత్తుగా త‌న ఎదురుగా ఓ వృద్ధుడు న‌డుచుకుంటు వ‌స్తూ సొమ్మ‌సిల్లి ప‌డిపోయాడు. అనుకోకుండా జ‌రిగిన సంఘ‌ట‌న‌తో ఆమె షాక్ తిన్న‌ది. ప‌రిగెత్తుకుంటు ద‌గ్గ‌రికి వెళ్లి చూసింది. గుండెపోటు కార‌ణంగా వృద్ధుడు చివ‌రి ఊపిరితో ఉన్నాడ‌ని గ్ర‌హించింది. వెంట‌నే త‌న నోటితో శ్వాస అందించింది. ప‌లుమార్లు వృద్ధుడి నోట్లో నోరు పెట్టి కొత్త ఊపిరి పోయ‌డంతో ఆగిపోయిన గుండెలో కొంచెం చ‌ల‌నం వ‌చ్చింది. ఆలోగా ఆ ప‌క్క నుంచే వ‌స్తున్న ఇద్ద‌రు యువ‌కులు వృద్ధుడికి సప‌ర్య‌లు చేశారు. మొత్తానికి ఆ వృద్ధుడు లేచి కూర్చున్నాడు. అమ్మాయి ఇచ్చిన కొత్త ఊపిరి ఆయ‌న‌కు పునర్జ‌న్మ‌నిచ్చింది. కోలుకున్న ఆ వృద్ధుడిని ఇద్ద‌రు యువ‌కులు భుజ‌నా చేతులు వేసుకొని తీసుకువెళ్లారు. ఆ అమ్మాయి సంతోషం నిండిన వ‌ద‌నంతో.. ఒక ఊపిరిని నిలిపిన ఆనందంతో అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ నెల 12న సంఘ‌ట‌న జ‌రిగింది. ఎక్క‌డో తెలియ‌దు.

 https://www.facebook.com/108630373972562/posts/383472916488305/

You missed