రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోగానే కరోనాను జయించేశామని విర్రవీగితే ఇక నడవదు. ఎందుకంటే ఈ డోసులు కూడా కరోనాను అడ్డుకోలేవు. కేవలం వైరస్ ప్రభావం తీవ్రం కాకుండా నిరోధిస్తాయంతే. స్వయంగా ఈ విషయాన్ని ‘అపోలో జేఏండీ’ సంగీతా రెడ్డి తెలిపారు. తన స్వానుభావాన్ని ఆమె మీడియాతో పంచుకున్నారు.
తను రెండు డోసులు వేసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డానని తెలిపారు. విపరీతమైన జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరగా ..అది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిందని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు మరవొద్దని ఆమె సూచించారు. త్వరలో రాబోయే థర్డ్‌వేవ్ కారోన సైతం ఈ వ్యాక్సిన్లకు, మందులకు లొంగడం లేదని వైద్యులు చెబుతున్నారు. పాత కరోనా కొత్తగా రూపాంతరం చెంది, మరింత బలంగా దాడి చేసే ముప్పు ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్లు కూడా దీన్ని పూర్తిగా అడ్డుకోలేవనే విషయం చాలా మందికి తెలియదు.
కొందరు సింగిల్ డోసు వేసుకొని చాలా ధైర్యంగా తిరుగుతున్నారు. డబుల్ డోస్ పూర్తయిన వారైతే కరోనా ఇక తమ దరిదాపుల్లోకి రాదనే ధీమాతో ఉంటున్నారు. నిర్లక్ష్యంగా కూడా వ్యవహరిస్తున్నారు. కాగా మరో నాలుగు నెలల పాటు డెల్టాప్లస్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియదని, అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్లు కరోనా ప్రభావాన్ని నియంత్రించేందుకు మాత్రమే ఉపయోగపడుతుందనే విషయాన్ని అవగాహన చేసుకుంటే మున్ముందు థర్డ్‌వేవ్ బారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.