క‌రోనా పై పెరిగిన అవ‌గాహ‌న, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌తో వ‌చ్చిన చైత‌న్యం డెంగ్యూను ప్ర‌బ‌ల‌కుండా చేస్తున్నది. ప్ర‌తి ఏడాది క‌రోనా కేసులు విప‌రీతంగా న‌మోదు అవుతూ వస్తున్నాయి. ప్రాణాలు తోడేసేవి. ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ప‌రీక్ష‌లు, ఫీజుల పేరుతో జ‌ల‌గల్లా ర‌క్తం పీల్చేవారు. కానీ గ‌డిచిన రెండు సంవ‌త్స‌రాలుగా డెంగ్యూ కేసులు సాధార‌ణ స్థాయిలోనే న‌మోద‌వుతున్నాయి.

అయితే జీహెచ్ఎంసీ మిన‌హా తెలంగాణ ప‌ల్లెల్లో డెంగ్యూ, మ‌లేరియా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గాయి. క‌రోనా దాడిచేసి ప్రాణాల‌రిస్తున్న త‌రుణంలో వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పెరిగింది. పరిస‌రాల ప‌రిశుభ్ర‌త పై చైత‌న్యం వ‌చ్చింది. ఎవ‌రికి వారే ఆరోగ్యం ప‌ట్ల త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకున్న క్ర‌మంలో దోమ‌ల నివార‌ణ జ‌ర‌గ‌డం, డెంగ్యూ, మ‌లేరియా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డాన్ని వైద్యాధికారులు గుర్తించారు.

అయితే సెకండ్ వేవ్ త‌ర్వాత కొంత నిర్ల‌క్ష్యం పెరిగింది. వ్య‌క్తిగత ప‌రిశుభ్ర‌త కూడా త‌గ్గుతూ వ‌స్తున్నది. మెల్ల‌మెల్ల‌గా ప్ర‌జ‌లు సీజ‌న‌ల్ వ్యాధుల బారిన ప‌డుతున్నారు. ప్రాణాల మీద‌కొస్తే గానీ ప్ర‌జ‌లు మేల్కోర‌నే విధంగా ప్ర‌స్తుతం థ‌ర్డ్‌వేవ్ భ‌యం వెంటాడుతున్నా జ‌నం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

You missed