పబ్లిసిటీ కోసం పవిత్రమైన అన్న చెల్లెళ్ళ బంధానికి ప్రతీకైనా రాఖీ పండుగను కూడా వాడుకోవడం, ఏ విలువలతో కూడిన జర్నలిజం అంటారో  చెప్పాలి.

మాట్లాడితే విలువల కోసం బతుకుతాం అని చెప్పే నీతులు, ఈ వార్త రాయడంలో ఏ విలువలు పాటించి రాశారో చెప్పాలి.

వాళ్ళ ఇంట్లో ఇత‌ను ఎదో గుమస్తా పని చేస్తున్నట్లు, వారి ముందే వీళ్ళు గొడవ పడ్డట్లు రాయడం వీరి పైశాచిక ఆనందానికి నిదర్శనం.

వార్తలు రాయడం తప్పని ఎవరు అనడం లేదు, కానీ ఈ రాసే రాతలు వ్యవస్థలోని లోపాల గురించి రాస్తే బాగుంటాయి.

వ్యక్తిగతమైన విషయాలను లేనివి ఉన్నట్లుగా రాస్తే అవి రోత పుట్టిస్తాయి తప్ప ఏమి ఉండవు.

ఏ ఆడపిల్ల అయినా పుట్టింటితో ఎన్ని గొడవలు ఉన్న రాఖీ పండుగ వస్తే, వెళ్లి అన్నలకు రాఖీలు కడుతుంది. అది అన్న చెల్లెళ్ళ బంధానికి ఉన్న గొప్పతనం.

కవితక్క తన తనయుని కోసం అమెరికా వెళ్తే, అన్న చెల్లెళ్ళ మధ్య గ్యాప్ ఉంద‌ని రాశాడు ఈ రిపోర్ట‌ర్‌.

ఈ రిపోర్ట‌ర్ రాసిన రాతలు ఒక్క వాళ్ళ కుటుంబాన్ని కాదు, అన్న చెల్లెళ్ళ అనుబంధాన్నీ అవమానించినట్లుగా ఉన్నాయి.

నేను ఒక ఆడబిడ్డగా ఆవేదనతో రాసిన మాటలు ఇవి.

Saritha Reddy Punuri

You missed