ఈటెల మొదటి నుండి బలమైన నాయకుడు.. అక్కడ తిరుగులేదు
ఈటెల గెలుపు నల్లెరుపై నడకే…..
గులాబీ అభ్యర్థి ఓడినా.. ఆ ఏముంది
కెసియార్ దృష్టి పెట్టలేదు..పెడితేనా..
అని అనుకునే అవకాశం ఉండేది..
ఒకవేళ.. ప్రభుత్వం పై నమ్మకంతో గెలిస్తే ఇక తిరిగేలేదు… అని జనం నమ్మేది
కాని ఇప్పుడు ఆ అవకాశం లేదు…
కేసియార్ పట్టింపులకు పోయి….
జనం అనుకున్న దానికంటే ఈటెల బలవంతుడని తెలియజేశారు..
200 కోట్ల అభివృద్ధి పనులు
2500 కోట్ల దళిత బంధు పథకం
కొత్త రేషన్ కార్డులు పింఛనులు
హుజురాబాద్ ప్రజలకు అందబోతున్నాయి
అందుకు కారణం… ఈటెల రాజినామానే కారణం అని నమ్ముతున్నారు.
అంతే కాదు… ఈగోకు పోయి…
అమలుకు సాధ్యం హామీలు ఇస్తున్నాడు
ఇవన్నీ రేపు మెడకు చుట్టు కుంటాయి
ఇంకా రెండున్నర సంవత్సరాల కాలం ఉన్నది. ప్రతి పక్షాలు ఊరుకోవు …
ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితి కనబడటం లేదు…కేవలం హుజురాబాద్ ఎన్నిక కొరకు ఇచ్చిన హామీల వలననే సంవత్సరానికి 50వేల కోట్ల భారం పడుతున్నది. అంటే బడ్జెట్ లో 1/3 వంతు అన్నమాట. అప్పు పుట్టదు.. పన్నులు వేస్తే జనం ఊరుకోరు అమలు చేయకపోతే కూడా జనం ఊరుకోరు.
ఒకవైపు ఉద్యోగాలు లేవు
నిరుద్యోగులకు ఉపాధి లేవు
ఉద్యోగులు అసంతృప్తిగానే ఉన్నారు
కరోనాతో ప్రజల ఆదాయం తగ్గింది
విద్యా వ్యవస్థ అస్థవ్యస్తం అయ్యింది
ఆరోగ్య వ్యవస్థ గాడి తప్పింది…
ఇలాంటి పరిస్థితులలో ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించి విఫలం ఐతే…
ప్రజా తిరుగుబాటు తప్పదు.
ఇప్పటివరకు… తెలంగాణ లో ఒక్క వ్యవసాయం ద్వారా తప్పా ప్రజల ఆదాయం పెరిగే మార్గాలు లేవు.
ఆ వ్యవసాయం లో 2014 నుండి ఇప్పటి వరకు మద్ధతు ధరను 1200 నుండి 2000 వరకు పెంచడం వలననే ……
ప్రజల ఆదాయ మార్గాలను పెంచకుండా కేవలం కేసియార్ తను ఇచ్చే పథకాల ద్వారానే ప్రజలు బ్రతకాలి ఆధారపడాలి అనే సంకుచిత ఆలోచనతో ఉన్నాడు.
తెలంగాణ లో కేసియార్ ఆదాయ మార్గాన్ని పెంచింది ఒక్క మద్యం పాలసీ ద్వారానే…2014 నుండి ఇప్పటి వరకు
సంవత్సరానికి 6000 కోట్ల నుండి 36000 కోట్ల పెంచడం లో గణనీయమైన కృషి చేశాడు.
ఈ పాలసీ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలు… తమ రోజువారీ కూలీ డబ్బులు అన్నీ కూడా.. మద్యం కొరకే ఖర్చు చేస్తున్నారు. దీనితో వారు అనారోగ్యానికి గురౌతున్నారు.. ఆస్తులు అమ్ముకొని మరింత పేదరికం లోకి జారుతున్నారు.
Gunda Mallikarjun TGian