మంత్రి హరీష్ రావు గారికి…

తీగుళ్ల కృష్ణ మూర్తి అగడాల గురించి
* ఇతను ఓ జర్నలిస్టుగా ఎక్కడా పనిచేయలేదు.
* అందుకే విలేకరుల సాధక, బాధలు తెలియవు.
* కెసిఆర్,కేటీఆర్,మీరు ఏం చెప్పారో తెలియదు.
* “నమస్తే తెలంగాణ”లోకి రావడంతోనే పాత వాళ్లపై పగబట్టినట్లు బయటకి పంపించాడు.
* ఎడిటర్ సీటుపై కూర్చుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు.
* ఇంకా వెళ్ల గొడుతూనే ఉన్నాడు.
@ బయటకి వెళ్లిన వారిపై మీరు స్వయంగా విచారణ జరిపించండి.
* ఎవరిని ఎందుకు పంపించాడో అర్ధం ఉండదు.
* ఎక్కడికి అక్కడ బ్యూరో ఇంచార్జి, స్టాఫర్, నియోజక వర్గ ఇంచార్జిలు, డెస్క్ జర్నలిస్టులను తొలగిస్తూ పోతూ తెగ అనందపడిపోతున్నడు.
* ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు..? వాళ్ల కుటుంబ పరిస్థితులు..? కష్ట కాలంలో వారు పత్రికకు చేసిన సేవలు ఏమిటి..? ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే సంస్థ నుంచి వెళ్లగొడుతున్నడు.
* పనిచేయలేని అసమర్థులను పక్కన పెట్టడంలో తప్పలేదు.
* ఇతర పత్రికలు పోటీగా నమస్తే ను నిలిపిన జిల్లాల బ్యూరో, స్టాఫర్లపై ఎందుకు కక్షగట్టారు..?
* ఇతర పత్రికల్లోని వారిని పెట్టుకుంటున్నారు.
👉 ఎడిటర్ కృష్ణమూర్తిపై మీకు మంచి అభిప్రాయం ఉండొచ్చు.
* మిమ్మల్ని ఇష్టపడి అభిమానించే జర్నలిస్టుల కోసమైనా వాస్తవాలు తెలుకునే ప్రయత్నం చేయండి.
👉 “నమస్తే”లో జరుగుతున్న “తీగుళ్ల” దారుణాలపై స్పందించండి.
* సంస్థ కోసం, ఓ విలేకరిగా పార్టీ అభివృద్ది కోసం పనిచేసిన వారికి న్యాయం చేయండి.
———
తెలంగాణ ఆత్మగౌరవ “నమస్తే తెలంగాణ” పత్రిక ఒకప్పటి మాట.
* ఇప్పుడది ” తీగుళ్ల ఆత్మగౌరవ” పత్రిక.

ఇట్లు
“నమస్తే తెలంగాణ” అభివృద్ది కోసం పనిచేసిన ఓ సీనియర్ జర్నలిస్ట్.

You missed