నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజధాని ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఎక్కించుకుని గురువారం రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్కు బయలుదేరింది. తీరా జిల్లా కోర్డు చౌరస్తా వద్దకు రాగానే బస్సు మొరాయించింది. గంట సేపు ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. ఇంకా నయం.. ఇందల్వాయి అడవుల్లో ఆగితే ఆ అర్ధరాత్రి ఆ అడవిలోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సివచ్చేదని వాపోయారు. ఆర్టీసీ బస్సులన్నీ చేతికొచ్చి ఇలా మొరాయించడం సర్వసాధారణంగా మారింది. ఆర్టీసీ అంటేనే ప్రయాణికులకు నమ్మకం పోయి భయం చోటు చేసుకుంటుంది. కొత్త బస్సులు కొనాలనే ఆలోచన ప్రభుత్వానికి ఇప్పట్లో వచ్చేలా లేదు. అప్పటి వరకు ఈ ఇక్కట్లూ తప్పవు.