రెండో వేవ్ నేర్పిన పాఠాలు – గ్రహించకపోతే మరో సారి ఉపద్రవం తప్పదు .

రెండో వేవ్ లో మన దేశం లో మరణాలు ఎక్కువ జరిగాయి అనేది నిర్వివాదాంశం . “ప్రభుత్వ లెక్కలు తప్పు , ప్రకటించిన దాని కంటే అనేక రెట్లు ఎక్కువ మరణాలు జరిగాయి” అనే వాదన వినిస్తోంది . ఇలా చెప్పేవారి ప్రకారం మన దేశం లో ఇప్పటిదాకా కరోనా తో యాభై లక్షల మంది మరణించారు . కాసేపు వీరి లెక్కలు నిజం అనుకొందాము . సీరో సర్వే లో డెబ్భై శాతం జనాభా కు కరోనా సోకింది అని తేలింది . అంటే మన దేశం లో కరోనా బారిన పడిన వారు మొత్తం 95 కోట్ల మంది . 95 కోట్ల మందికి సోకితే యాభై లక్షల మరణాలు . అంటే మరణాల రేటు ఎంత ? ౦ .5 శాతం .

ప్రచారం ఏమని ? కరోనా సోకితే ప్రతి వందమందికి అయిదుగురు చనిపోతారు అని . జరిగింది ఏమిటి ? కరోనా సోకితే ప్రతి రెండు వందల మందిలో ఒకరు మాత్రమే చనిపోయారు .

నిజం .. ఈ మరణాలు ఎక్కువే . చాలా ఎక్కువ . ప్రతి ప్రాణం విలువైనదే . యాభై లక్షల మరణాలు అంటే ఘోరకలి. ఎందుకిలా జరిగింది ? ఇప్పటికైనా రెండో వేవ్ లో ఏమి జరిగిందో అర్థం చేసుకొని పాఠాలను గ్రహించడానికి మన సమాజం సిద్ధంగా ఉందా ? ఇప్పటిదాకా మీకు ఎవరూ చెప్పని నిజాలు …. చదవండి . అర్థం చేసుకోండి . లేక పొతే రేపు మూడో వేవ్ రానక్కర లేదు . కాస్త కేసులు పెరిగితే చాలు … మరో సారి ఘోరకలి . అప్పుడు దేశాన్ని ఎవరూ రక్షించలేరు .

మార్చ్ 2021 రెండో వారం .. కరోనా కేసులు పెరుగున్నాయని విపరీతమైన ప్రచారం . ఈ సారి కరోనా సోకితే మూడు రోజుల్లో పోతారు అని విష ప్రచారం . దీనితో ఢిల్లీ మంబై లాంటి నగరాల్లో డబ్బున్న వారు ఆరోగ్యం గా ఉన్నా, ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రుల్లో నెల – రెండు నెలలు కోసం బెడ్స్ బుక్ చేసుకొని చేరిపోయారు . ఢిల్లీ ముంబై దాకా ఎందుకు ? హైదరాబాద్ లో, ఆఖరికి తిరుపతి లాంటి చిన్న పట్టణంలో కూడా లో టోకు పద్దతిన నెలకు రూమ్ లు మాట్లాడుకొని ఆసుపత్రుల్లో చేరిన వారు వున్నారు . బహిరంగ చర్చ పెడితే నేను ఋజువులు చూపుతాను . దీంతో అటుపైన నిజంగా కేసులు పెరిగినప్పుడు బెడ్స్ లేని పరిస్థితి తయారయ్యింది . ఎక్కువ మంది మరణించడానికి ఇది ఒకటో కారణం .

కరోనా సోకితే మూడు రోజుల్లో మరణిస్తారు అనేది ఒక పెద్ద బూతు .. మెడికల్ మాఫియా తెలివిగా దీన్ని ప్రచారం చేసింది . అదే పనిగా వీడియో లు తీసి జనాల్ని భయకంపితుల్ని చేసారు . కరోనా సోకితే కొంత మంది లో రక్తం లో క్లోట్స్ ఏర్పడం లాంటి కారణాల వల్ల ఆక్సిజన్ శాతం పడిపోతుంది . ఆక్సిజన్ శాతం 94 అంత కన్నా ఎక్కువ ఉండాలి . కానీ క్లోట్స్ ఏర్పడం లాంటి కారణాల వల్ల ఇది 94 కంటే తక్కువ స్థాయి కి పడిపోవడం ప్రారంభిస్తుంది . అప్పుడు ఆ వ్య్తకి గుండె ఊపిరి తిత్తులు లాంటివి డామేజ్ కావడం మొదలవుతుంది . ఆక్సిజన్ శాతం 94 నుంచి 70 కి పడిపోవడానికి కనీసం రెండు రోజులు పడుతుంది . ఇది చాలా విలువైన సమయం . ఇలా పడిపోతున్నప్పుడు వ్యక్తికి ఏమీ తెలియదు . నిజానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది . ఈ స్థితి ని హ్యాపీ హైపోక్సియా అంటారు . దీని గురించి తెలుగు లో తొలిసారిగా రాసింది నేను . మే 2020 లోనే హ్యాపీ హైపోక్సియా అంటే ఏమిటి , దీని వల్ల జరిగే పరిణామాలు ఏమిటి అని చెప్పి .. ఈ స్థితి ని నివారించడానికి ఇంట్లో డాక్టర్ లాంటి పల్స్ ఆక్సీమీటర్ ఉంచుకోవాలి అని రాసాను . అప్పటిదాకా ఇది కేవలం ఆసుపత్రుల్లో వినియోగించే సాధనం . ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో అప్పుడే ప్రజల్లోకి వెళుతోంది . దీన్ని అధ్యయనం చేసి నేను వీడియో పెట్టాను . పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించాను . కానీ దృరదృష్టం ఏమిటంటే రెండో వేవ్ నాటికి కూడా దీని గురించి తెలియని వారు కోకొల్లలు . జ్వరం వచ్చినా పట్టించుకోరు . పల్స్ ఆక్సీమీటర్ తో చెక్ చేసుకోరు . ఆక్సిజన్ శాతం డెబ్భై కంటే తక్కువైతే శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది అయితే అప్పుడు పానిక్ . ఆ స్థితిలో ఆసుపత్రికి వెళితే దొరకని బెడ్స్ . బెడ్ దొరికినా ఆక్సిజన్ డెబ్భై కి పడిపోయినప్పుడు అప్పటికే గుండె కు డామేజ్ జరిగి ఉంటుంది . కోలుకోనే అవకాశం తగ్గిపోతుంది . మూడు రోజులు ఏమి ఖర్మ? . మూడు గంటల్లోనే పోయినా ఆశ్చర్యం లేదు . కరోనా సోకిన మూడు రోజుల్లో కాదు . కరోనా సోకి దాని గురించి పట్టించుకోకుండా కనీసం పల్స్ ఆక్సీమీటర్ చెక్ చేసుకోకుండా ఉంటే ఐలా జరిగింది . మాస్క్ ల కు ఇచ్చిన ప్రచారం లో ఒక శాతం పల్స్ ఆక్సీ మీటర్ పై అవగాహన కల్పించడం లో వెచ్చించినా కొన్ని లక్షల ప్రాణాలు దక్కేవి .

రెండో వేవ్ ప్రారంభ దశలో ప్రైవేట్ ఆసుపత్రులు తమ బెడ్స్ ను నింపుకోవడానికి ఆడిన ఆటలు అన్నీ ఇన్ని కావు . ఆ దశలో జ్వరం లాంటి లక్షణాలతో ఆసుపత్రులకు వెళితే దొంగ HRCT రిపోర్ట్ లు సృష్టించి కనీసం దగ్గు లేని వ్యక్తిని కోరాడ్స్ -5 అని చూపించి ఆసుపత్రుల్లో అడ్మిట్ చేసుకొన్నారు . ఈ స్థితి వల్ల నిజంగా బెడ్స్ అవసరం అయిన వారికి దక్కని స్థితి ఏర్పడింది . పబ్లిక్ చర్చ పెడితే కనీసం వంద దొంగ HRCT రిపోర్ట్స్ చూపిస్తాను . హెచ్చరిసిటి రిపోర్ట్ లను దుర్వినియోగం చెయ్యడం అనేది రెండో వేవ్ ప్రారంభం లో విపరీతంగా జరిగింది . అటు పై ఆసుపత్రులు కిక్కిరిసిన స్థితి వచ్చేటప్పటికి దాని దుర్వినియోగం తగ్గింది .

రెండో వేవ్ లో మెడికల్ మాఫియా ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కావు . ఆసుపత్రిలో బెడ్ ఎవరికి ఇవ్వాలి ? రోగం తో బాగా సీరియస్ గా ఉన్న వారికి కదా ? చిన్న పట్టణాల్లో సరిగ్గా దీనికి బిన్నంగా జరిగింది . అసలు కరోనా సోకని వారికి కేవలం అనుమానంతో ఆసుపత్రికి వచ్చిన వారిని భయపెట్టి అడ్మిట్ చేసుకొన్నారు . వీరిని పడుకోపెట్టి మూడు పూటలా తిండి పెట్టి నాలుగు విటమిన్ టాబ్లెట్ లు ఇచ్చేస్తే , లక్షో రెండు లక్షల్లో వసూలు చేసుకోవచ్చు . అదే రోగం సోకి సీరియస్ గా ఉన్న వాడిని అడ్మిట్ చేసుకొంటే ? రిస్క్ ఎక్కువ . ఫలితం తక్కువ .. అదీ వీరి ఆలోచన .

ప్రతి రోజూ భయపెట్టే ప్రచారం . దాని తో జనాలకు పిచ్చెక్కింది . ఆక్సిజన్ సిలిండర్ లో కొనుక్కొని ఇంట్లో దాచుకొన్న వారు, లక్షల్లో వున్నారు . దీంతో అవసరం అయిన వారికి ఆక్సిజన్ దొరకని స్థితి .

రెండిసివెర్ ల కృత్రిమ కొరత సృష్టించారు . బ్లాక్ లో అమ్మారు .. జనాల భయాన్ని సొమ్ము చేసుకోవడం లో పూర్తి స్థాయిలో సఫలీకృతులు అయ్యారు .

ఇక చిన్న చితకా ఆసుపత్రుల్లో చికిత్స విధానాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది . రోగం సోకి 14 రోజులయ్యి శరీరం లో వైరస్ చచ్చినా, రెండిసేవేర్ ఇవ్వడం , రోగం అనే అనుమానంతో ఆసుపత్రికి రాగానే గంపెడు స్టెరాయిడ్ లు ఇవ్వడం .. చెబితే .. జరిగినవి తలచుకొంటే గుండె చెరువవుతుంది . కరోనా కొత్త రోగం . ఎంత మంది డాక్టర్ లు దీని గురించి తమ నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకొన్నారు ? ఎన్ని చోట్ల దైవాధీనం చికిత్స లు జరిగాయి ? వందల వేల ఋజువులు తెస్తా .

వ్యక్తి భయానికి గురైతే కార్టిసోల్ స్రవిస్తుంది . ఇది గుండె ను దెబ్బ తీస్తుంది . మయోకార్డిటిస్ అంటే గుండె పోటు వచ్చే అవకాశం పెరిగిపోతుంది . ఇలా భయంతో మరణించిన వారు కోకొల్లలు .

జనాల్లో భయం తగ్గకుండా ఇప్పటికీ ప్రచార ఉదృతి ని మాఫియా కొనసాగిస్తోంది . రక్తం మరిగిన పులి ఊరుకోదు . ఎక్కడైనా రెండు చోట్ల కేసులు పెరిగితే తిరిగి జనాల్లో పానిక్ తీసుకొని రావాలి. బెడ్స్ నింపుకోవాలి . ఇదే ప్లాన్ .

నిజమే !కరోనా లో గొప్ప సేవలు అందించిన డాక్టర్ లు వున్నారు . వారికి వందనం . నేను మాట్లాడుతున్నది కొన్ని ఆసుపత్రుల గురించి . వారికి కీలు బొమ్మలైన కొంత మంది డాక్టర్ ల గురించి . వీరినే ఫార్మాసురులు అన్నాను . మెడికల్ మాఫియా అని కూడా పిలవొచ్చు .

మూడో వేవ్ రాకుండా ఉండాలంటే వచ్చినా దాని వల్ల మరణాలు జరగకుండా ఉండాలంటే

1 . ఎండ లో నడవండి . మీ శరీరానికి తగినంత డి విటమిన్ ఇవ్వండి . ఒంట్లో కొవ్వు శాతాన్ని తగ్గించండి . ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం , సమతుల ఆహారం తీసుకోండి . శాఖాహారులు బి 12 మాత్రలు తీసుకోండి . భయపెట్టే ప్రచారానికి దూరంగా వుండండి . చక్కగా నిద్ర పొండి. పాజిటివ్ ఫీలింగ్స్ మన ఇమ్మ్యూనిటి ని బలోపేతం చేస్తాయి . భయం ఇమ్మ్యూనిటి ని చంపేస్తుంది .
2 . వాక్సిన్ వేసుకోండి . రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించండి . మాస్క్ లు మరి కొంత కాలం తప్పని సరి. భయం తో ఇంట్లో నే కూర్చోవద్దు . పనిలో పడండి. ఇంట్లో ఉంటే ఇల్లు , ఒళ్ళు గుల్ల అవుతుంది . పిచ్చెక్కుతుంది . భయం పెరుగుతుంది .

౩. పల్స్ ఆక్సీ మీటర్ ను ఇంట్లో ఉంచుకోండి . రోజుకు ఒక్క సారి చెక్ చేసుకోండి . పల్స్ ఆక్సీమేటర్ ఇంట్లోని డాక్టర్ .. ఇంట్లోని డయాగ్నొస్టిక్ సెంటర్ .

ఇవన్నీ కాదండీ.. ఈ సారి సోకితే ప్రైవేట్ ఆసుపత్రికి పోను .. కచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేరుతాను అనుకోండి . అసలు మొదటి వేవ్ ప్రారంభం లో ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతి ఇవ్వలేదు . ఇక పై భవిష్యత్తులో కరోనా చికిత్స లు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అని చట్టం చేస్తే .. దెబ్బకు మూడో వేవ్ మాయం అయిపోతుంది . పిచ్చి ప్రచారం ఆగిపోతుంది .

మూడ్ వేవ్ వస్తుందని ప్రభుత్వాలు పెద్దఎత్తున బెడ్స్ రెడీ చేసాయి . ఆక్సిజన్ ప్లాంట్స్ ను అందుబాటులోకి తెచ్చాయి . వేవ్ లు వచ్చినా మునుపటిలాగా బ్లాక్ మార్కెటింగ్ కుదరదు . జనాల్లో పెద్ద ఎత్తున పానిక్ సృష్టిస్తేనే మెడికల్ మాఫియా పన్నాగం సాధ్యం అవుతుంది .

అసలు వేవ్ లు వుండవు .. అలాగని కరోనా పోతుందని కాదు . మరో పది ఏళ్లకు కూడా అదిగో ఆయనకు కరోనా సోకింది .. ఈయన పోయారు లాంటి వార్తలు వస్తూనే ఉంటాయి . కరోనా ఎక్కడికీ పోదు . అది అక్కడ ఇక్కడ జనాల్ని బలిగొంటునే ఉంటుంది . కానీ వేవ్ లు అంటే పెద్ద సంఖ్యలో జనాలు ఆసుపత్రులు పాలు కావడం జరగదు .

డెబ్భై శాతం జనాభా కు అంటి బాడీ లు వున్నాయి . డిసెంబర్ దాక వేవ్ లు వుండవు . ఈలోగా బూస్టర్ లు వస్తాయి . బూస్టర్ ల సంగతి ఎలా వున్నా టి సెల్స్ రక్షణ ఉంటుంది . అంటే ఇంగ్లాండ్ లో స్థితి . ఇంగ్లాండ్ లో యాభై వేల కేసులు వచ్చినా మరణాలు పది దాట లేదు . చక్కగా స్టేడియాల్లో క్రీడలు ఎంజాయ్ చేస్తున్నారు . అదే మన దేశం లో నైతే.. కేసులు మళ్ళీ పెరగడం ప్రారంభిస్తే .. ఈ సారి ఉపద్రవమే . ఇప్పటికే ఈ మందు .. ఈ మందు అంటూ పిచ్చి మందులను కొని పెట్టుకొంటున్నారు . ఈ సారి వేవ్ వస్తే .. అది ఇంగ్లాండ్ లాంటి ఒట్టి వేవ్ అయినా మన దేశాన్ని ఎవరూ రక్షించలేరు . కారణం జనాల్లో భయం .. భయాన్ని పెంచి పోషించి సొమ్ము చేసుకొనేందుకు కాచుకొని కూర్చొన్న ముఠాలు .

దయ చేసి జనాల్లో సరైన అవగాహన కలిపించడం లో సాయ పడండి. ఈ మెసేజ్ ను మీ గ్రూప్ ల లో షేర్ చెయ్యండి .

కరోనా చంపదు. భయం చంపుతుంది . అవగాహన లేమి చంపుతుంది . వేవ్ లు రావు . కేసులు పోవు . కరోనా పోదు . కేసులు పెరిగినా ఇంగ్లాండ్ లాంటి స్థితి . మీ అవగాహననే మీకు రక్ష. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేశాన్ని కాపాడుకోండి .

Amarnath Vasireddy

You missed