మెడికల్ మాఫియా మళ్లీ తన కోరాలు చాస్తున్నది. కరోనా కన్నా దీని కోరలే చాలా డేంజర్. మనిషిని బతికిస్తున్నామనే నెపంలో వారి రక్తం పీల్చే జలగలు ఇవే. రెండో వేవ్‌లో రెచ్చి పోయి కోట్లకు పడగలెత్తి… మరింత బలిష్ఠంగా తయారయ్యింది ఇది. ఇప్పుడు థర్డ్ వేవ్ వచ్చేసిందనే ప్రచారాన్ని మెల్లగా స్టార్ట్ చేస్తున్నది. చాపకింద నీరులా ప్రజల్లో మెల్లగా భయాన్ని ఇంజెక్ట్ చేస్తున్నది. వేల కోట్ల మెడికల్ మాఫియా సామ్రాజ్యాలు మరోసారి వెలుగులోకి రానున్నాయి. ప్రభుత్వాలనే గుప్పిట్లో పెట్టుకునే ప్రబల శక్తి కలిగి ఉన్న ఈ మాఫియా మరోసారి థర్డ్ వేవ్ వచ్చేస్తున్నదని ఊదరగొడుతున్నది.
మరో వైపు ప్రభుత్వం ఈ థర్డ్ వేవ్ ఇప్పట్లో రాదనే చెబుతున్నది. ఇంకా రెండో వేవ్ దశ కొనసాగుతున్నదంటున్నది. ఓ వైపు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. థర్డ్‌వేవ్ ఇప్పట్లో రాదు.. వచ్చే అవకాశాలు లేవు అని ప్రకటించాడు తాజాగా. కానీ థర్డ్ వేవ్‌పై ప్రచారాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఈ భయం గుప్పిట్లో నుంచి మార్కెట్ బయటపడటం లేదు. చేతి నిండ పనులు లేక కొందరు.. సరిపడా ఉపాధి దొరకక మరికొందరు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అప్పులు పెరిగిపోయి… పొట్టనింపుకునేందుకు పడే తిప్పలు తప్పడం లేదు.
కానీ మెడికల్ మాఫీయా మాత్రం థర్డ్ వేవ్ అంటూ జనాలను మరోసారి దోచుకునేందుకు సిద్ధమయ్యింది. రక్తదాహం మరిగిన రాక్షసుల మాదిరిగా ఈ మెడికల్ మాఫియా మరోసారి జనాలపై పంజా వేసేందుకు రెడీగా ఉంది. జనాలు దీన్ని నిలువరించడం ఎవరి వల్ల అవుతుంది?
