“అరేయ్ నీకెంతిచ్చిర్రు.. ”

“ప‌ది…”

“మ‌రి నీకు..?”

“ఐదే..!”

“నేను ముందే చేరిన అందుకే ఐదు.. నువ్వు లేట్‌గా పోయిన‌వ్ అందుకే ప‌ది ఇచ్చిండ్రు.. ”

“ఇంకింత లేటుగా పోతే ఇంకా రేటు పెరిగేదేమో రా…”

“అవున్రా… ”

“ఇప్పుడు ముందుగాళ్ల పోయిన మేము బ‌క్రాల‌మా…? ”

“అరే అట్లెందుక‌నుకుంట‌వ్ రా బై… ”

“మ‌ళ్ల ఇంకో తాప కూడా ఇస్త‌రేమో రా..”

“తీస్క‌పోయి ఆళ్ల‌ మంద‌ల క‌లిపేసుకున్న‌రు.. ఇగ మ‌ళ్ల ఇస్త‌రంట‌వా?”

“ఏ ఇస్త‌ర్రా.. మ‌స్తు ఖ‌ర్చు చేస్తుర్రు… సూసిన‌వ్ క‌దా.”

“మ‌న ‘కోటి’గానికి కోటి ఇచ్చిర్రంట‌ర‌… ”

“ఆడు సార్థ‌క‌నామ‌ధేయుడు రా.. కోటి పేరు పెట్టుకొని కోటి నొక్కేసిండులే.”

“ఆని జీవితంలో కూడా కోటి సంపాదించ‌క‌పోవురా…”

“ఎంపీపీల‌కు మొన్న పోయినోళ్ల‌కు 25 ఇస్తే.. నిన్న పోయినోళ్ల‌కు 50 ఇచ్చిర్రంట గ‌దా..”

“అంతేనా.. కొద్ది రోజులు లేట్‌గా పోయి చేరితే డ‌బుల్ ఇస్తాండ్రా…?”

“గీ విష‌యం ముందే తెల్వ‌క‌పాయ‌రా వారీ..!”

“కొంచెం ఆలిస్యం చేసి మ‌రీ చేరుదుము.. అప్పుడు అడిగినంత ఒస్తుండే గావొచ్చు..”

“నువ్వ‌ప్పుడు చెప్తే ఇనేటట్టున్న‌వారా … పైస‌లిత్తార్ర‌నంగ‌నే ఎగేసుకుంట పోలే…”

“అవ్‌గానీ, రెండో తాప .. ఎప్పుడిస్త‌రంట‌వ్‌..”

“ఏ ఇస్త‌రు తియ్ రా.. ఊకే రంది పెట్టుకోకు.”

“ఇస్త‌రంట‌వ‌.. క‌చ్చితంగా.. ”

“ఆ ఇయ్య‌క‌పోతే .. అటు జంప్ అయిదం.. ఏమ్‌రో.. మ‌న‌కేమ‌న్నా మానం మ‌ర్యాద లేదనుకుంటున్న‌ర‌…”
“అంతే అంటవా”

“అంతే మరి”

“ఔ… అంతే మరి’

 

You missed