తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా ఆగస్టు నెలలో పదిహేను కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు జూలై నుంచి నవంబర్ వరకు నెలకు పది కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నా, వివిధ కారణాలతో జూలైలో 5 కిలోలే పంపిణీ చేశారు. ఈ నెలలో జూలై కోటాను కలుపుకొని 15 కిలోల బియ్యాన్ని పాత రేషన్ కార్డుదారులందరికీ పంపిణీ చేయనున్నది. అన్ని రకాల ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం, కొత్తగా ఈ కార్డులు పొందిన వారికి ఒక్కొక్కరికి 10 కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. . కాగా అంత్యోదయ కార్డుదారులకు కుటుంబానికి కిలో చక్కెరను రూ.13.50కి, గోధుమలు జీహెచ్‌ఎంసీ పరిధిలో 3 కిలోలు, మున్సిపల్‌లో 2 కిలోలు, కార్పొరేషన్ పరిధిలో ఒక కిలో చొప్పున ఏడు రూపాయలకు రేషన్ కార్డులందరికీ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
