రాజ‌కీయాల్లోకి రాక‌ముందు వ్యాపార‌మే ప్ర‌పంచం.

స్నేహితులే లోకం.

కుటుంబ‌మే త‌న ప్ర‌యార్టీ.

కానీ జీవితంలో అనుకోని సంఘ‌ట‌న‌లు ఎన్నో జ‌రుగుతాయి. చేయాల్సిన ప‌నులు ఎన్నో మ‌న కోసం మిగిలే ఉంటాయి. క‌ర్త‌వ్యం మ‌న వేలు ప‌ట్టి మ‌న‌ల్ని ముందుకు న‌డిపిస్తూ ఉంటుంది. గురుత‌రబాధ్య‌త మ‌నం చేయాల్సిన బాధ్య‌త‌ను గుర్తు చేస్తూ ఉంటుంది. అలా కాల‌క్ర‌మంలో రాజ‌కీయ నాయకుడిగా ఎదుగుతూ వ‌చ్చిన ప్ర‌శాంత్‌రెడ్డి ప్ర‌పంచం ఇప్పుడు ప్ర‌జాసేవ‌. త‌నకు అందివ‌చ్చిన అవ‌కాశం, అద్భుత సంద‌ర్భాన్ని ప్ర‌జా సంక్షేమం కోసం వినియోగించుకోవ‌డంలో సక్సెస్ అవుతున్నారు.త‌న శ‌క్తి మేర ప‌నిచేస్తూనే.. ఆప‌న్నుల‌కు అభ‌య‌హ‌స్తం ఇస్తూనే ఇలా అవ‌స‌రం వ‌చ్చిన సంద‌ర్భంలో స్నేహ‌హ‌స్తాన్నీ అందుకుంటున్నారు.
ఆ స్నేహాన్ని స్వార్ధానికి ఉప‌యోగించుకుంటున్నారు. ఆ స్వార్ధం పేరే ‘ప్ర‌జాసేవ‌’,
పేద‌ల సంక్షేమం. ఆ స్నేహితులంతా గ‌ర్వంగా భావించే ఈ స్నేహితుడికి స్నేహితుల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.

You missed