తీన్మార్ మ‌ల్ల‌న్న … ఆ టీంలో ఏదో గొడ‌వ‌లు. లుక‌లుక‌లు. ఎవ‌రో బ్యూరో చీఫ్ అంట ప్రెస్‌మీట్ పెట్టి ఆరోప‌ణ‌లు గుప్పించాడు. దీన్ని టీ న్యూస్ కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికిన‌ట్టు బ్రేకింగ్ న్యూస్‌లో వేసుకుని సంబ‌ర‌ప‌డిండి. అదేదో కొంచెం సేపు కాదు… వేసిందే వేసి.. తిప్పిందే.. తిప్పి.

వీళ్ల‌కు ఇంత‌కు మించి వేరే బ్రేకింగ్ లేన‌ట్టుండి. సోష‌ల్ మీడియాలో పనిలేని ముచ్చ‌ట్ల‌ను వైర‌ల్ చేసే బ్యాచ్‌క్ ఏమాత్రం తీసిపోమ‌నే రీతిలో టీ న్యూస్ క్వాలిటీ ఈ రేంజ్‌లో వెలిగిపోతుంద‌న్న మాట‌.

మొన్న హుజురాబాద్‌లో ఓ గోడ‌గ‌డియారం ప‌గల‌గొట్టిన వీడియో ఒక‌టి దొరికింది…. ఇదీ బిగ్ బ్రేకింగే.. దీనికి ఇంకా కొన్ని వ్యాఖ్య‌లు జోడించి ప్ర‌జ‌లంతా ఛీ కొడుతున్నారు. నిల‌దీస్తున్నారు. ఇవ‌న్నీ ఏందీ? అన‌స‌రంగా మీరు వాళ్ల‌ని హీరో చేయ‌డ‌మో.. లేక‌పోతే మీ స్థాయిని దిగ‌జార్చుకోవ‌డ‌మే అవుతుంది.

అవునూ … ఇంత‌క‌న్నా బ్రేకింగ్‌లు.. ముఖ్య‌మైన వార్త‌లు మ‌న‌కు లేవా?
మ‌న‌మున్న‌దే అందుకంటారా? అయితే వోకే… కానీ అలా…