నాయకుల రాకను స్వాగతిస్తూ దాడి పొడవునా ఎర్రటి ఎండలో దండాలు పెడుతూ గంటల తరబడి వేచిచూసే సంస్కృతి తెలంగాణ వచ్చిన తరువాత ఎక్కువైంది. దొరస్వామ్య పాలన అవశేషాలో, అధికార దర్పమో కానీ ఇలా దండాలు పెడుతూ స్వాగతించడాన్ని మన నాయకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పైగా ఇది మాకు ధన్యవాదాలు తెలిపే చర్య అని, అభిమానంతో నిలబడుతున్నారని సమర్ధించుకుంటున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏకంగా దాడి పొడవునా నిలిచిన మహిళల ఫోటో తన ఫేస్బుక్లో ఫోస్ట్ చేసుకుని సంతోష పడ్డాడు. దీనిపై దుమారం రేగింది. విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ఓ కాంగ్రెస్ నాయకుడు దీనిపై ఎన్హెచ్ఆర్సీకీ ఫిర్యాదు చేశాడు. ఉద్యోగినులను ఎండలో నిలబెట్టాడని పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ స్వీకరించింది. కేటీఆర్, సంతోష్ల పై విచారణకు రెడీ అయ్యింది.
Related Post
పదేండ్ల పాలన.. పది తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి..! సెంటిమెంట్ పెట్టుబడి.. రాజకీయం రాబడి.. ఇదే బీఆరెస్ సంపాదన సీక్రెట్..! బీఆరెస్ పాలనలో పాలకుల వృద్ధి ఇలా.. జనం జీవన ప్రమాణాలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే.. దేశంలోనే అత్యధికంగా సంపాదించే ప్రాంతీయ పార్టీలో బాపు పార్టీనే నెంబర్ వన్..! రూ. 686 కోట్ల సంపాదన అంటే మాటలు కాదు.. పైసాపిచ్చి అందరికి మించి.. అధికార కాంక్ష అంతకు మించి.. 2023-24 ప్రాంతీయ పార్టీల ఆదాయ వివరాలను బయట పెట్టిన ఏడీఆర్ సంస్థ..
Sep 12, 2025
Dandugula Srinivas