రోడ్డున పడ్డ గుత్తేదార్ల బతుకులు… ! వీధికెక్కిన సర్కార్ పరువు..!! చిన్న కాంట్రాక్టర్ల జీవితాలు చితికిపోయాయి…. కమీషన్లు తీసుకుంటూ పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు… డిప్యూటీ సీఎం మొదలు… ప్రభుత్వ సలహాదారు వరకు… అంతా కమీషన్ల తీస్మార్ ఖాన్‌లే…! తాళిబొట్లు తాకట్టు పెట్టి… పనులు చేస్తే.. ఏళ్లుగా బిల్లులు లేవు.. కమీషన్లిస్తేనే బిల్లులిచ్చే సంస్కృతికి కాంగ్రెస్ ద్వారాలు…
(దండుగుల శ్రీనివాస్) తాళిబొట్లమ్ముకున్నారు. పది రూపాల మిత్తీలకు తెచ్చుకున్నారు. గవర్నమెంటు పనులు చేస్తే నాలుగు పైసలు సంపాదించుకోవచ్చనుకున్నారు. ఆ పుస్తెలు తాకట్టులోనే ఉన్నాయి. బిల్లులు బల్లకిందే ఉన్నాయి. కమీషన్లిస్తే బిల్లులు. పెద్దలకు ద్వారాలు తెరవబడి ఉన్నాయి. మంత్రి, ప్రభుత్వ సలహాదారు మొదలు…