ఇలాంటి వార్త చూస్తే మన సీఎం సారుకు ఎంత సంతోషమో. ఎవరి కాళ్ల మీద వారు నిలబడి ఏదో ఒక పని చేసుకుంటే అంతకు మించిన ఆనందమేముంటుంది? చదువుకున్నోళ్లందరికీ ఉద్యోగాలొస్తాయా? ఇలా ఏదో ఒక చిన్నపాటి వ్యాపారమో, ఓ ప్రైవేట్ ఉద్యోగమో చేసుకుంటే ప్రభుత్వానికి భారం తగ్గుతుంది కదా! నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన పనిలేదు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం పడిగాపులు కాయాల్సిన ఆగత్యమూ ఉండదు. ఈ ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోల రందీ ఉండదు. ఇలాంటి యువత ఇప్పటి నిరుద్యోగులకు ఆదర్శం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఇంకా ఆశతో ఎదురుచూడడం అత్యాశే అవుతుంది. దురాశ దుఃఖానికి చేటుగా మిగులుతుంది.