నిజామాబాద్ నగర శివారులోని దాస్‌నగర్ వడ్డెర బస్తీ ప్రజలకు సంబంధించిన భూములను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కబ్జా చేశారని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వనీర్ దండి వెంకట్ ఆరోపించాడు. మున్సిపల్ కార్పొరేషన్ రెండో డివిజన్ పరిధిలోని దాస్‌నగర్‌కు చెందిన సర్వే నంబర్ 506లో ఉన్న భూమిని, పుప్పాల చెరువు రెండెకరాల శిఖం భూములను కబ్జా చేసి కోట్లాది రూపాయల వెంచర్లు చేస్తున్నారని ఆరోపించాడు. ఈ భూ అక్రమాలకు పాల్పడిన భూ నేరస్తుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సీ నారాయణ రెడ్డికి బాధితులతో కలిసి ఫిర్యాదు చేశాడు. భవిష్యత్తులో ఆందోళనకు సిద్ధమవుతామని ప్రకటించాడు.