గల్లీ లొల్లి ఢిల్లీకి చేరింది. కేసీఆర్ బీఆరెస్‌ పై అప్పుడే దాడి షురూ అయ్యింది. సీఎం బిడ్డ కవితను ఢిల్లీ లిక్కర్‌ స్కాం పేరుతో ఇరుకున పెట్టేందుకు అన్ని దారుల నుంచి ఒత్తిడి మొదలయ్యింది. ఇవాళ సీబీఐ ఏడు గంటల పాటు కవితను విచారించగా… ఆ వెంటనే మళ్లీ 91 సీఆర్‌పీసీ కింద మరో నోటీసు ఇవ్వడం కలకలం రేపింది. ఆలోగా తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం రేపు… హైదరాబాద్‌లో పెడుతున్నట్టు అన్ని జిల్లాలకు మెసేజ్‌ వెళ్లింది. జిల్లా నుంచి దాదాపు ముఖ్య నేతలు పది మంది వరకు బయలుదేరి రానున్నారు. కవిత నేతృత్వంలో జరగనున్న ఈ మీటింగు ప్రాధన్యతను సంతరించుకోనున్నది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితను అంత ఈజీగా వదిలేలా లేదు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. కేసీఆర్‌ మోడీని టార్గెట్ చేస్తున్న క్రమంలో సీఎం కూతురైన కవితను ఈ స్కాం పేరుతో మరింత ఇబ్బంది పెట్టి మోరల్‌గా దెబ్బ తీయాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్‌ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. సీబీఐ విచారణ కాగానే నేరుగా కవిత ప్రగతిభవన్‌ వెళ్లి కేసీఆర్‌ ను కలుసుకున్నారు. ఎత్తుకు పై ఎత్తు వేసే క్రమంలో ఈ తతంగాన్ని పార్టీకి కాకుండా జాగృతి డీల్‌ చేసేలా, ఉద్యమ కార్యచరణ రచించేలా రేపటి మీటింగు నడిచే అవకాశం ఉంది.

 

ఆహ్వానం

ప్రియమైన తెలంగాణ జాగృతి బాధ్యులకు నమస్తే. రేపు మధ్యాహ్నం 1.00 గంటలకు హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం కలదు. కవితక్క గారు అధ్యక్షత వహించే ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ బాధ్యులు, పూర్తిస్థాయి జిల్లాల కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, సీనియర్ సభ్యులు అందరూ హాజరు కాగలరు.
సమయం: మధ్యాహ్నం 1 గం. లకు
స్థలం: మహమ్మదీయ మాన్షన్, ముషీరాబాద్, హైదరాబాద్.

You missed