జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మలుపు తిరిగాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పావులు కదపడంతో ….. గడీల రాములు వర్గం తోకముడిచి ముఖం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడీల రాములు ప్యానల్ మొత్తం 18 మంది పోటీ నుంచి విరమించుకుని .. ఎన్నికలకు ముఖం చాటేయడం కొన మెరుపు. మొదటి నుంచి ఈ ఎన్నిక పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

అధ్యక్షుడిగా గడీల రాములు ఎనిమిదేళ్లు పదవిని అనుభవించి చేసిందేమీ లేదు కానీ… పైగా ఒలంపిక్ భవన్, స్టేడియం కోసం ప్రభుత్వం కేటాయించిన రెండెకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు సర్వ ప్రయత్నాలు చేశాడు. దీన్ని ప్రతిపక్షాలు… క్రీడా సంఘాల బాధ్యులు, క్రీడాకారులు దీన్ని తిప్పి కొట్టారు. పెద్ద పోరాటమే చేశారు. దీంతో అప్పుడు కబ్జాల రాయుడు గడీల రాములు తోక ముడిచాడు. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఎన్నిక కు ఏర్పాట్లు జరిగాయి. ఈసారి బాజిరెడ్డి రంగంలోకి దిగారు. చక్రం తిప్పారు. గడీల ఆకృత్యాల ను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన బాజిరెడ్డి ఈసారి ఎలాగైనా ఆ ప్యానల్‌కు సరైన గుణపాఠం చెప్పి ఓడించాలని పావులు కదిపారు. చక్రం తిప్పారు. మంత్రిని ఆశ్రయించాడు గడీల. అక్కడా చుక్కెదురైంది.

ఆఖరికి మధ్యవర్తిత్వం గా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ ను కూడా రంగంలోకి దింపాడు గడీల. కానీ ప్లానింగ్ బెడిసి కొట్టింది. దీంతో గడీల రాములు ప్యానల్ మొత్తానికి మొత్తం తోక ముడిచింది. పోటీ నుంచి నిష్క్రమించింది. బాజిరెడ్డి సపోర్టు చేసిన ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈగ సంజీవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బొబ్బిలి నర్సయ్య, జిల్లా ఉపాధ్యాక్షులుగా బాజిరెడ్డి జగన్మోహన్, ఏ ప్రవీణ్ రెడ్డి, భక్తవత్సలం, కే వాసు, సంయుక్త కార్యదర్శులుగా విజయానంద్, రాజుగౌడ్, మహ్మద్ ఉమర్, పీ శంకర్, కోశాధికారిగా జీ భూమారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా యాసిన్, మనోజ్ కుమార్, ఎండీ షకీల్, జావీద్, సురేశ్, రమేశ్, అతీఖ్ ఉల్లా లు ఏక్రగీవంగా ఎన్నికయ్యారు.

