నేను నిజామాబాద్ లో పసుపు బోర్డు హామీ ఇచ్చినట్లు నీవు కూడా నన్ను గెలిపిస్తే ఐదే ఐదు రోజుల్లో మునుగోడు నియోజకవర్గ ప్రజలందరి అకౌంట్లో మనిషికి కోటి రూపాయలు వేస్తానని హామీ ఇవ్వండి గెలిచిన తరువాత ఏలాగు మనం ఇవ్వం పీకం ఏమాంటావు…???
నిన్ను నిజామాబాద్ రైతులు తోక్కినట్లు నన్ను ఇక్కడ తోక్కించుకోమ్మంటావా ఏంది?? నీ ఎదవ ఐడియాలు నాకోద్దు నేను ఏలాగు గెలిచెది లేదు పీకేది లేదు…..

Ashireddy Srinivas Reddy
……………………………………………………………………………….

సోష‌ల్ మీడియాలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌తో ఆడుకుంటున్నారు. ఇవాళ మునుగోడు ప్ర‌చారంలో బీజేపీ అభ్య‌ర్థితో క‌లిసి అర్వింద్ పాల్గొన్నాడు. నిజామాబాద్‌కు చెందిన కొంద‌రు టీఆరెస్ అభిమానులు, రైతులు సోష‌ల్ మీడియాలో ఇద్ద‌రూ ప్ర‌చారంలో ఉన్న ఫోటోను పెట్టి పై విధంగా వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ప‌సుపు బోర్డుకు ధీటుగా స్పైసెస్‌బోర్డు .. ఇంకేదో తెచ్చాన‌ని అర్వింద్ ఎంత మొత్తుకున్నా ఇక్క‌డి రైతులు మాత్రం అర్వింద్ మాట‌లు న‌మ్మ‌డం లేదు. ప‌సుపు బోర్డే కావాల‌ని, ఎందుకు బాండ్ పేప‌ర్ రాసిచ్చావంటూ ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ‌… నిల‌దీస్తూ వ‌స్తున్నారు. ఇలా సంద‌ర్బం ఏది దొరికినా ఆడుకుంటున్నారు. నిజామాబాద్ ఎంపీ ఎన్నిక‌ల్లో అర్వింద్ త‌న‌ను ఎంపీగా గెలిపిస్తే ప‌సుపుబోర్డు తెస్తాన‌ని బాండుపేప‌ర్‌పై రాసిచ్చాడు. ప్ర‌చారంలో ఓసారి ఐదు రోజులు, ఓసారి వంద‌రోజుల్లో గెలిస్తే ప‌సుపుబోర్డు తెస్తాన‌ని కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ప్లేటు ఫిరాయించాడు. రైతులు అడిగితే ప‌సుపు బోర్డు లేదు.. ఏం లేదు…. నేనొచ్చినంక‌నే ప‌సుపు రైతుకు గిట్టుబాటు ధ‌ర వ‌స్తుంది తెలుసా..? అంటూ ఉల్టా ద‌బాయిస్తూ వ‌స్తున్నాడు.

You missed