డీఎస్. ధర్మపురి శ్రీనివాస్. బీసీ నేత. సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ కురువృద్ధుడు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సత్సంబంధాలు నెరిపిన వాడు. పీసీసీ చీఫ్‌గా రెండు పర్యాయాలు పనిచేసిన వాడు. సీఎం కుర్చీ ఆశించినవాడు. అదంతా ఒకప్పటి చరిత్ర. ఇప్పుడు డీఎస్‌ది రాజకీయంగా ఒడిశిన శకం. ముగిసిన ముచ్చట. ఆయన ఆరోగ్యం సహకరించడం లేదు. రాజకీయ తొలి ఇన్నింగ్స్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న డీఎస్.. రెండో ఇన్నింగ్స్‌లో డక్ అవుట్ అయ్యాడు. ఏదో ప్లానింగ్. మళ్లీ భవిష్యత్తు చక్కదిద్దుకునే వ్యూహం. పశ్చాత్తాప ప్రతిచర్య… ఏదో చేద్దామనుకునేలోపే.. ఇటు కాలం.. అటు ఆరోగ్యం రెండూ సహకరించలేదు. ఆయన రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయకముందే పెవిలియన్ బాట పట్టాడు.
రాజకీయాలకు ఇక శాశ్వత రాజీనామానే అనుకునేలా ఆయన ఇంటికే పరిమితం కావడం ఆయన అభిమానుల్లో ఒకింత నైరాశ్యం. టీఆరెస్‌లో చేరడమే తను చేసి తప్పు అని చెంపలు వాయించుకుని మరీ చెప్పుకున్న డీఎస్.. ఆ తప్పు దిద్దుకునే చర్యలో .. దిద్దుబాటు క్రమంలో మళ్లీ కాంగ్రెస్ గడప తొక్కినా.. అప్పటంత పలుకుబడీ లేక… పెద్దల పట్టింపులేక.. ఆరోగ్యం సహకరించక.. కాంగ్రెస్ కండువాతోనే తన జీవితం ముగియాలనే తన అంతిమ కోరిక.. ఇంకా తీరనే లేదు. మనోవేదనలోనే ఆయన జీవిత చరమాంకం కొనసాగుతూ ఉంది. పెద్ద కొడుకు సంజయ్‌ను ఎమ్మెల్యే చేయాలనే కల .. కల్లగానే కనులముందు కదలడగా… చిన్న కొడుకు బీజేపీలో రాణిస్తున్నాడనే సంతోషమే ఆయన మిగిలి ఉంది.
హ్యాపీ బర్త్ డే డీస్….
