వాడు క‌న‌బ‌డితే స‌ముద్రాలు త‌డ‌బ‌డ‌తాయి…

వాడు నిల‌బ‌డితే సామ్రాజ్యాలు సాగిల‌బ‌డ‌తాయి..

వాడి పొగ‌రు ఎగిరే జెండా…. వాడి ధైర్యం చీక‌ట్ల‌ను చీల్చే మండుటెండ‌…

వాడు భూత‌ల్లి చ‌నుబాలు తాగిన మ‌న్యం ముద్దుబిడ్డ …

గోండు బొబ్బులి…. కొమురం భీమ్‌…..

త్రిపుల్ ఆర్ సినిమాలో కొమురం భీం ఇంట్ర‌డ‌క్ష‌న్ డైలాగ్‌… చాలా ఫేమ‌స్‌.. రోమాలు నిక్క‌బొడిచే ఆ ప‌దాలు… అత‌ని ధైర్యాన్ని సూచించే ఆ నిర్వ‌చ‌నాలు …. ప్ర‌తీ ఒక్క‌రి నోట ఫేమ్ డైలాగ్‌గా మిగిలిపోయిందిది.

ఇప్పుడీ డైలాగ్ కేసీఆర్‌కు యాప్ట్ చేసుకున్నారు టీఆరెస్‌.. కాదు కాదు బీఆరెస్ సైన్యం…

రేపు ద‌స‌రా సంద‌ర్భంగా కేసీఆర్ జాతీయ రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌ట‌న చేయ‌నుండ‌టంతో ఇప్పుడంత‌టా ఇదే చ‌ర్చ‌.

భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతుంది..? పార్టీ విధి విధానాలెలా ఉంటాయి..? రాష్ట్ర పార్టీ ప‌రిస్థితి ఏంటీ..?

కేటీఆర్ సీఎం కావ‌డం ఇక ఖాయం… దేశ స్థాయిలో కేసీఆర్ మార్కు ఎలా ఉండ‌బోతుంది..? ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఏ మేర‌కు ల‌భిస్తుంది..? కేసీఆర్ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లీకృత‌మ‌వుతాయా…?

ఇలా ఎన్నెన్నో ప్ర‌శ్న‌లు.. మ‌రెన్నో అనుమానాలు. వీటి మాటున ఏదో ఏదో ధైర్యం..మ‌రేదో ధీమా..

వీట‌న్నింటి న‌డుమా… ఈ త్రిపుల్ కొమురం భీమ్ డైలాగ్ వీడియోను కేసీఆర్‌కు యాప్ట్ చేసి తీసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అయ్యింది. గులాబీ అభ‌మానుల‌కు ఇది వీనుల … క‌నుల విందుగా ఉంది.

You missed