నాన్న హీరో అయినంత మాత్రాన తామూ అదే వారసత్వాన్ని అందుకుంటామని, ఏళ్ల తరబడి వెండి తెరను ఏలేద్దామనుకుని వస్తారు కొందరు.ఇదే కోవలోని వాడు మంచు విష్ణు. అతన్ని ఏనాడో ప్రేక్షకులు చూడటం మానేశారు. అయినా తీస్తూనే ఉన్నాడు. డైలాగ్ డెలివరీ సరిగా రాదు.. అయినా సరే తన ప్రతాపాన్ని ప్రేక్షకులకు చూపుతూ ఉంటాడు. అప్పుడెప్పుడో శ్రీహరి పుణ్యమా అని ఢీ సినిమా ఒక్కటి హిట్టయ్యింది. ఆ తర్వాత అంతోఇంతో దూసుకెళ్తా అనే సినిమా కాస్త నవ్వులు పంచింది. అంతే. ఆ తర్వాత అన్నీ పల్టీలే. ఇగో ఇప్పుడు ఇలా జిన్నా పేరుతో మళ్లీ ఓ ప్రయోగాన్ని ప్రేక్షకుల సహనానికి పరీక్షగా వదిలేందుకు సిద్దమయ్యాడు.
మొన్న టీజర్ రిలీజ్ కార్యక్రమంలో ఓ మాటనేశాడు పుసుక్కున. సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ .. ఇద్దరూ తనతో నటిస్తే వారినే చూస్తారు తప్ప.. నన్నెవడు చూస్తాడని. కరెక్టుగా చెప్పావు బ్రదర్. నీ ముఖం.. నీ హావబావాలు, నీ డైలాగులు.. చూసేందుకైతే నిజ్జంగా ఎవరూ రారు. కనీసం వారి గ్లామర్ చూసేందుకైనా వస్తారు. పెట్టిన పెట్టుబడైనా రావొచ్చేమో. నీ తమ్ముడు నీకన్నా ముందే ఈ ప్రయోగాలన్నీ చేసి ఇక ఇలా కూడా వర్కవుట్ అవదని వదిలేశాడు. తత్వం బోధపడ్డది. తప్పుకున్నాడు. నువ్వూ అదే దారిలో ఉన్నావు. అంతే మరి మన కటౌట్‌కు అంత సీన్ లేదనుకున్నప్పుడు.. ఇలా ఫోర్న్ స్టార్‌నూ రంగంలోకి దింపొచ్చు. తప్పులేదు. పరిస్తితులు అలాంటివి మరి. అర్థం చేసుకోరూ..!!