ఈ బాలుడి పేరు వివేక్ రాజ్. గిరిజనుడు. తండ్రి అకాలమరణం పొందాడు. గుండెపోటుతో. అమ్మమ్మ, తాత ఆలనాపాలనే దిక్కయ్యింది. మోపాల్ మండలంలోని అమ్రబాద్ తండాలో ఓ ప్రైవేటు స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడి తాత…. బాజిరెడ్డి జగన్ దగ్గరకు వచ్చాడు. తన గోడు వెల్లబోసుకున్నాడు. ప్రైవేటులో ఫీజులు కూడా కట్టలేని పరిస్తితిలో ఉన్నానని చెప్పాడు. బాలుడి మంచి చెడు, చదువు పట్ల శ్రద్ద అన్నీ అడిగి తెలుసుకున్న జగన్ ఆ స్కూల్‌కు ఫోన్ చేసి ఫీజుల తగ్గించాల్సిందిగా కోరాడు. వాళ్లూ సమ్మతించాడు.
ఇతోధికంగా తనూ కొంత ఆర్థిక సహాయం చేస్తానని, వివేక్‌ను మంచిగా చదివించాలని ఆశీర్వదించాడు. నాన్న లేని ఆ బాలుడికి అండగా నిలిచిన జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు ఆ పండుటాకులు. ఇగో ఆ బాలుడు తనకు చేసిన సాయానికి మురిసిపోతూ తను బాగా చదివి డాక్టర్‌నయితానని చెప్పాడు జగన్‌కు సంతోషంగా…
