మ‌ధుయాష్కీ కూడా తిన్నింటి వాసాలు లెక్క‌బెట్టే లిస్టులో చేరిపోయాడు. ఒక‌ప్పుడు పార్టీ ద్వారా ప‌ద‌వులు అనుభ‌వించి కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన నేత‌లు ఇప్పుడు పార్టీ క‌ష్ట‌కాలంలో ఉంటే దాన్ని మ‌రింత అనాథ‌ను చేసి మాట్లాడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా మ‌ధుయాష్కీ కూడా చేరాడు. తొలివెలుగు కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న అక్క‌సంతా క‌క్కాడు. రేవంత్‌రెడ్డితో వైరుధ్యం ఉన్న మాట వాస్త‌వ‌మే. కానీ ఇది పార్టీ ని మ‌రింత దిగ‌జార్చేలా ప్ర‌క‌ట‌న చేయడం.. అదీ ఓ కీల‌క బాధ్య‌త‌లో ఉన్న లీడ‌ర్ .. అదే చేశాడు మ‌ధుయాష్కీ.

రేవంత్ ఇంటింటికి వెళ్లి కాళ్లు మొక్క‌మంటున్నాడు ఓట‌ర్ల‌వి. ఎందుకు మొక్కాలి..? క‌రెక్టే. కానీ అది మాట్లాడాల్సింది అంత‌ర్గ‌తంగా. మీడియా క‌డ‌పునింపే వార్త‌ల్లో కాదు. మాణిక్కం ఠాకూర్ ప‌ట్టించుకోవ‌డం లేదు.. బాగా లేట్ చేస్తున్నాడు.. అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డంలో … న‌న్ను కేవ‌లం ఇన్చార్జిగా మునుగోడుకు పెట్టారు.. నా బాధ్య‌త లేదు.. మేం మూడో స్థానానికి ప‌డిపోతున్నాం.. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ఇది ఘోరంగా ప్ర‌భావం చూపుతుంది. మా ప్లేస్ బీజేపీ ఆక్ర‌మించింది…. ఇంకా ఏవేవో పిచ్చి కూత‌ల‌న్నీ కూశాడు. కాంగ్రెస్ నాయ‌కుడ‌నిపించుకున్నాడు. షెబాష్‌…!! మీ లాంటి నాయ‌కుల‌న్నందుకే ఆ పార్టీ ప‌రిస్థితి ఇంత‌లా దిగ‌జారింది…