కేంద్రమంత్రిగా కిష‌న్‌రెడ్డికి అరుదైన అవ‌కాశం. కొంద‌రు జాత‌కాలంతే అలా క‌లిసొస్తాయి. కానీ వాటిని నిలుపుకోవ‌డం.. ఆ ప‌ద‌వికి వ‌న్నెల‌ద్ద‌డం అంద‌రితో అయ్యే ప‌నికాదు. కొంద‌రు మ‌రీ హోదా మ‌రిచి ప్ర‌వ‌ర్తిస్తారు. ఇక్క‌డ చిన్న క్లారిఫికేష‌న్‌… పీజేఆర్ మంగ‌ళి షాపుల ఓపెనింగ్‌కు కూడా పోయేది. అదే ఆయ‌న‌ను మాస్ లీడ‌ర్‌గా నిలిపింది కూడా. కానీ కొంద‌రు చేసే పనుల‌కు మాట్లాడే మాట‌ల‌కు , హోదాకు పొంత‌న ఉండ‌దు. అచ్చం మ‌న కిష‌న్‌రెడ్డి లాగే. కేసీఆర్‌, ప్ర‌భుత్వంపై బాగానే విమ‌ర్శ‌లు చేస్తాడు. కానీ త‌ను ఏం చేశానో, ఏం తెచ్చానో చెప్పుడు. బీజేపీ లీడ‌ర్లే అంతే అనుకోండి. కానీ కొన్ని కార్య‌క్ర‌మాల ద్వారా ఇలా దొరికిపోయి .. ప‌రువు తీసుకోవ‌డం కూడా కిష‌న్‌రెడ్డికి అలవాటుగా మారింది.

మొన్నామ‌ధ్య ఆక్సిడెంట్ అయి చికిత్స తీసుకుని కోలోకున్న సాయిధ‌ర‌మ్ తేజ్ ఇంటికి పోయి ప‌ల‌క‌రించ‌డం కూడా వివాద‌మే అయ్యింది. కుర్‌కురే ప్యాకెట్లు పంచ‌డం కూడా ఆయ‌న‌ను వార్త‌ల్లో నిలిపింది. దీనిపై టీఆరెస్ శ్రేణులు ఎంత‌లా ట్రోలింగ్ చేశారంటే.. కుర్‌కురే కిచ‌న్‌రెడ్డి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించేంత‌గా. ఇప్పుడు మళ్లీ అలాంటి ట్రోలింగుల‌నే ఎదుర్కుంటున్నాడు కిష‌న్‌రెడ్డి. సితాఫ‌ల్ మండి రైల్వే స్టేష‌న్ లిఫ్టుల‌ను ప్రారంభించేందుకు ఆయ‌న వెళ్లాడు. దీనిపై కేటీఆర్ స‌హా అంతా చ‌లోక్తులు, చ‌మ‌త్కారాలు వ‌దిలారు. ఎంత‌టి గొప్ప ప్రాజెక్టును తెచ్చావ‌య్యా.. కేంద్ర మంత్రి హోదాలో అంటూ. ఇది స‌రిపోదంటూ ఆ శిలాఫ‌ల‌కం మీద జాతికి అంకితం అని కూడా రాయించారు. ఆట‌లో అర‌టిపండులా కిష‌న్ రెడ్డిని తీసిపారేస్తున్నారు టీఆరెస్ శ్రేణులు సోష‌ల్ మీడియాలో…